
Jr.NTR: మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్.. ఆ బయోపిక్‌లో నటించనున్న హీరో!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం వరుస సినిమాలతో శరవేగంగా ముందుకు సాగుతున్నారు స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్.
ఈ క్రమంలో ఆయన్ను సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటివరకు ఎన్నడూ చూడని ఓ విభిన్నమైన పాత్రలో ఎన్టీఆర్ కనిపించబోతున్నారని సమాచారం.
భారతీయ సినిమాకు ఆద్యుడు అయిన దాదాసాహెబ్ ఫాల్కే పాత్రలో ఆయన నటించనున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఇటీవల విడుదలైన వివరాల ప్రకారం... ప్రముఖ దర్శకుడు రాజమౌళి సమర్పణలో రెండు సంవత్సరాల క్రితం ప్రకటించిన 'మేడ్ ఇన్ ఇండియా' అనే బహుభాషా చిత్రం మళ్లీ వార్తల్లోకి వచ్చింది.
వివరాలు
దాదాసాహెబ్ ఫాల్కే జీవిత కథ ఆధారంగా సినిమా
ఈ సినిమాను రాజమౌళి తనయుడు ఎం.ఎం. కార్తికేయ, నిర్మాత వరుణ్ గుప్తా సంయుక్తంగా నిర్మించనున్నారు.
ఈ ప్రాజెక్ట్‌కు నితిన్ కక్కర్ దర్శకత్వం వహించనున్నట్లు అప్పుడే తెలియజేశారు.
ఇప్పుడు ఈ చిత్రం, దాదాసాహెబ్ ఫాల్కే జీవిత కథ ఆధారంగా రూపొందించనున్న బయోపిక్‌గా మారిందని తెలుస్తోంది.
ఈ సినిమా ద్వారా భారతీయ సినిమా ఆద్యాన్ని, అభివృద్ధిని ప్రపంచానికి పరిచయం చేయాలన్న లక్ష్యంతో సినిమాను రూపొందిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం, ఈ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
వివరాలు
ఫైనలైజ్ అయిన తుది స్క్రిప్ట్
బాలీవుడ్ మీడియాలో అందిన సమాచారం ప్రకారం,ఎన్టీఆర్ ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
"స్క్రిప్ట్ విన్న వెంటనే ఆయన ఎంతో ఉత్సాహంగా స్పందించారు. భారతీయ సినిమాల పుట్టుకను, ఆ ప్రయాణాన్ని ప్రేక్షకులకు తెలిపే ఈ కథపై ఆయనకు విపరీతమైన ఆసక్తి కలిగింది. ఈ సినిమాపై సినీబృందం అంతా ఎంతో అంచనాలతో ఎదురుచూస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై సుదీర్ఘ చర్చలు జరిగి, తుది స్క్రిప్ట్‌ను కూడా ఫైనలైజ్ చేశారు" అని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ వార్తలు నిజమైతే ఎన్టీఆర్ కెరీర్‌లో మరో ప్రత్యేకమైన ప్రయోగాత్మక చిత్రంగా ఇది నిలవనుంది.
వివరాలు
నెల్సన్ దిలీప్‌కుమార్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎన్టీఆర్
ఇదిలా ఉండగా, ఎన్టీఆర్ ప్రస్తుతం నాలుగు సినిమాలను తన లైన్‌అప్‌లో ఉంచుకున్నారు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'డ్రాగన్' సినిమాలో నటిస్తున్నారు.
ఇక బాలీవుడ్‌లో 'వార్ 2' చిత్రంతో ప్రవేశించనున్నారు. అనంతరం 'దేవర 2' ప్రాజెక్ట్‌ను చేపట్టనున్నారు.
ఈ క్రమంలోనే తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో ఓ కొత్త సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వెలువడుతున్నాయి.
ఇప్పుడు వీటితో పాటు దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ కూడా ఆయన ప్రాజెక్ట్‌ల జాబితాలో చేరడం విశేషం.