Chiranjeevi : తమిళ డైరెక్టర్ మిత్రన్‌కు మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'విశ్వంభర' సినిమాలో నటిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా 2024 సమ్మర్‌లో విడుదల కానుంది. ఈ ప్రాజెక్టు సెట్స్‌పై ఉండగానే చిరంజీవి తన తదుపరి సినిమాను అధికారికంగా ప్రకటించారు. 'దసరా' సినిమా ద్వారా విజయవంతమైన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరు ఓ కొత్త ప్రాజెక్ట్ చేయనున్నారు. నేచురల్ స్టార్ నాని, నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భగవంత్ కేసరి, ఎఫ్2 వంటి చిత్రాలతో ఆకట్టుకున్న అనిల్ రావిపూడి, మెగాస్టార్‌తో ఓ సినిమా చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహూ గారపాటి భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు.
వరుస సినిమాలతో చిరంజీవి బిజీ
ప్రస్తుతం అనిల్ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో బిజీగా ఉండగా, అది విడుదలైన వెంటనే చిరు సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నారు. ఇక తమిళ డైరెక్టర్ పి.ఎస్. మిత్రన్ కూడా మెగాస్టార్ కోసం ఓ కథ సిద్ధం చేశారని, త్వరలోనే ఆ కథను చిరంజీవికి వినిపించి ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కార్తితో సర్దార్ వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన మిత్రన్, చిరంజీవితో మరో భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రస్తుతం రెండు ప్రధాన సినిమాలు షూటింగ్ దశలో ఉండగా, మరో రెండు పెద్ద ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నాయి. వశిష్ట, శ్రీకాంత్ ఓదెల, అనిల్ రావిపూడి, మిత్రన్‌లతో కలిసి చిరంజీవి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.