LOADING...
Writers Room : మీరు రైటర్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ అవకాశం మీ కోసమే..
మీరు రైటర్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ అవకాశం మీ కోసమే..

Writers Room : మీరు రైటర్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ అవకాశం మీ కోసమే..

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 29, 2025
03:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీవీ,సినిమా రంగాల్లోకి ఎవరూ లేకుండా ప్రవేశించడం సులభం కాదు. అలంటి వాళ్ళ కోసం,కాబోయే రచయితల కోసం జీ తెలుగు ఒక అద్భుతమైన అవకాశం ఇస్తుంది. ఈ సందర్భంగా,భవిష్యత్ రచయితలకు గేట్స్ తెరుచే విధంగా జీ తెలుగు ఒక ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసింది. "జీ రైటర్స్ రూమ్" పేరుతో కొత్తగా ప్రారంభమైన ఈ కార్యక్రమంలో యువ రచయితలను ఎంపికచేస్తుంది. జీ సంస్థ,'యువర్స్ ట్రూలీ Z' అనే బ్రాండ్‌ద్వారా,అన్ని మీడియా ప్లాట్‌ఫామ్‌ల కోసం కథలు,ప్రోగ్రామ్స్ రాయగల ప్రతిభావంతుల రచయితలను వెతుకుతోంది. ఈ ప్రక్రియలో రాత పరీక్ష నిర్వహించి,నైపుణ్యం ఉన్నవారిని ఎంపిక చేస్తుంది. జీ రైటర్స్ రూమ్‌లో చేరిన వారు టీవీ,డిజిటల్,సినిమా ప్రాజెక్ట్స్ కోసం ఆకర్షణీయమైన, సమర్థవంతమైన కథలను రూపొందించే అవకాశం పొందుతారు.

వివరాలు 

ఆగస్టు 30న హైదరాబాద్‌లో రైటర్స్ రూమ్ కార్యక్రమం 

ప్రస్తుతం, దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతున్నప్పటికీ,ఇప్పుడు హైదరాబాద్‌లో ప్రత్యేకంగా జరగనుంది. జీ తెలుగు ఆగస్టు 30న హైదరాబాద్‌లో అమీర్ పేట్‌లోని సారథి స్టూడియోస్ ఎదురుగా ఉన్న శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్‌లో రైటర్స్ రూమ్ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. పాల్గొనదలచిన వారు ఉదయం 9:00గంటల నుంచి మధ్యాహ్నం 2:00గంటల వరకు అందులో చేరవచ్చు. మరిన్ని వివరాల కోసం 9397397771 నంబర్‌కు కాల్ చేయవచ్చు. ఈ కార్యక్రమంలో ప్రతి అభ్యర్థి రాత పరీక్ష రాయాల్సి ఉంటుంది.పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు జీ రైటర్స్ రూమ్‌లో చేరే అవకాశం పొందతారు. వారికి పరిశ్రమ నిపుణులు రచనాశైలిలో మెలకువలు నేర్పిస్తారు. అంతేకాక, జీ నుంచి రాబోయే సీరియల్స్, సినిమాలు, వెబ్ సిరీస్ ప్రాజెక్ట్‌లలో కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది.

వివరాలు 

యువ రచయితలకు ప్రతిభ ప్రదర్శించే ఒక గొప్ప వేదిక జీ రైటర్స్ రూమ్

ఇప్పటికే నెల్లూరు, విజయవాడ, విశాఖపట్టణం ప్రాంతాల్లో జీ రైటర్స్ రూమ్ ఆధ్వర్యంలో జరిగే సెలక్షన్‌లలో వందలాది యువ రచయితలు పాల్గొన్నారు. ఇప్పుడు హైదరాబాద్‌లో ఈ అవకాశాన్ని యువ రచయితలు కూడా ఉపయోగించుకోవచ్చు. జీ ఎంటర్‌టైన్‌మెంట్ సౌత్ హెడ్ అనురాధ గూడురు మాట్లాడుతూ, "జీ రైటర్స్ రూమ్ యువ రచయితలకు ప్రతిభ ప్రదర్శించే ఒక గొప్ప వేదిక. ఈ కార్యక్రమంలో ఎంపికైన రచయితలు మా సంస్థలో రూపొందే సీరియల్స్, సినిమాలు, వెబ్ సిరీస్‌లకు రచనలో భాగమయ్యే అవకాశాలు పొందుతారు" అని తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జీ తెలుగు చేసిన ట్వీట్