Yamini Bhaskar: 'ఇండస్ట్రీలో ఎదవలు ఉన్నారు.. అవకాశాల పేరుతో అన్నీ ఆశిస్తారు'.. కాస్టింగ్ కౌచ్ పై యామిని షాకింగ్ కామెంట్స్
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్‌లో 'రభస' సినిమాతో నటిగా పరిచయం అయిన యామిని భాస్కర్, ఆ తర్వాత హీరోయిన్‌గా స్థిరపడింది. భలే మంచి చౌక బేరం, కొత్తగా మా ప్రయాణం, నర్తనశాల, కాటమరాయుడు వంటి పలు చిత్రాల్లో ఆమె కీలక పాత్రలు చేసింది. అయినప్పటికీ, ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. చాలా విరామం తర్వాత యామిని నటిస్తున్న తాజా సినిమా 'సైక్ సిద్ధార్థ'. సిద్ధు హీరోగా నటించిన ఈ చిత్రం జనవరి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొని, తన కెరీర్ ప్రారంభ దశలో ఎదుర్కొన్న కఠిన అనుభవాల గురించి మాట్లాడింది.
వివరాలు
అందరూ అలా ఉండరు - చాలా కొద్ది మంది మాత్రమే అలా ప్రవర్తిస్తారు: యామిని
"ఇండస్ట్రీలోనే కాదు, బయట కూడా తప్పుదారి పట్టిన వ్యక్తులు ఉంటారు. నాకు కూడా అలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. కెరీర్ మొదట్లో అన్నీ బాగానే సాగాయి కానీ మధ్యలో కొందరు అలా తగిలారు. అలాంటి వాళ్లను ఎలా ఎదుర్కోవాలో తెలియక సినిమాలనే వదిలేయాలనుకున్న దశ కూడా వచ్చింది. అందుకే కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్నాను. అందరూ అలా ఉండరు - చాలా కొద్ది మంది మాత్రమే అలా ప్రవర్తిస్తారు. కొందరు మేల్ డామినేషన్ చూపిస్తూ మహిళలను తక్కువగా చూస్తారు. అవకాశాల కోసం ఏదైనా చేయాల్సిందే అన్నట్టుగా ఆలోచిస్తారు. అటువంటి మనుషులను చూసినప్పుడు భయం కూడా వేసేది. నేను అంతగా మాట్లాడేదాన్ని కాదు, దాంతో కొన్ని సార్లు నాకు యాటిట్యూడ్ ఉందని భావించారు."
వివరాలు
మహిళలూ అలాగే ప్రవర్తించడం చూసి నిజంగా షాక్ అయ్యా: యామిని
కేవలం పురుషులే అలా ఉంటారని తాను చెప్పదల్చుకోలేదని యామిని స్పష్టం చేసింది. ఇటీవల కాలంలో కొంతమంది మహిళలూ అలాగే ప్రవర్తించడం చూసి నిజంగా షాక్ అయ్యాను. భయపడకుండా అలాంటి వారిని ధైర్యంగా ఎదుర్కోవాల్సిందే," అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించింది. యామిని చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా కాలం తర్వాత తెరపై వస్తున్నఈ సినిమా ఆమె కెరీర్‌కు ఎలాంటి ఫలితం ఇస్తుందన్నది చూడాల్సి ఉంది.