Loading...
Yash: రష్మిక వ్యాఖ్యలు నా వ్యక్తిత్వాన్ని మార్చలేవు: యశ్
రష్మిక వ్యాఖ్యలు నా వ్యక్తిత్వాన్ని మార్చలేవు: యశ్

Yash: రష్మిక వ్యాఖ్యలు నా వ్యక్తిత్వాన్ని మార్చలేవు: యశ్

వ్రాసిన వారు Moogati Shabari
Aug 16, 2026
02:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

నటి రష్మిక మందన్న గతంలో తనపై చేసిన వ్యాఖ్యలపై కన్నడ స్టార్‌ హీరో, పాన్‌ ఇండియా నటుడు యశ్‌ స్పందించారు. 2017లో ఓ ఇంటర్వ్యూలో రష్మిక.. యశ్‌ను ఉద్దేశించి 'మిస్టర్ షో ఆఫ్' అంటూ వ్యాఖ్యానించారు. తాజాగా ఆ పాత వ్యాఖ్యలపై యశ్‌ తనదైన శైలిలో స్పందించారు. రష్మిక అలా ఎందుకు మాట్లాడారో తనకు తెలియదని యశ్‌ చెప్పారు. ''ఆ సమయంలో ఆమె సినీ పరిశ్రమలోకి కొత్తగా అడుగుపెట్టారు. కొన్ని టీవీ కార్యక్రమాల్లో యాంకర్లు మూడు, నాలుగు ఆప్షన్లు ఇచ్చి.. అందులో ఒకదాన్ని ఎంచుకోవాలని చెబుతుంటారు. బహుశా ఆమెకు ఇచ్చిన ఆప్షన్లలో ఆ పదం తనకు సరిపోతుందని భావించి ఉండొచ్చు. నేను మాత్రం ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు'' అని యశ్‌ తెలిపారు.

వివరాలు

పెద్ద ఎత్తున ట్రోల్‌..

ప్రతి ఒక్కరికీ తమదైన అభిప్రాయం ఉంటుందని, దానిని తాను గౌరవిస్తానని ఆయన అన్నారు.

''ఎవరైనా నా గురించి ఏ విధంగా ఆలోచించినా అది నా వ్యక్తిత్వాన్ని నిర్ణయించదు.

ఇతరుల అభిప్రాయాలు, దృష్టికోణాల ఆధారంగా నా క్యారెక్టర్ మారదు'' అని యశ్‌ స్పష్టం చేశారు. అదే సమయంలో తన అభిమానులకు కూడా యశ్‌ ఓ స్పష్టమైన సందేశం ఇచ్చారు.

''తోటి నటీనటులను గౌరవించని వారు నా అభిమానులు కాదు'' అని ఆయన పేర్కొన్నారు.

అయితే, 2017లో రష్మిక చేసిన ఈ వ్యాఖ్యలపై యశ్‌ అభిమానులు అప్పట్లో తీవ్రంగా స్పందించారు.

సోషల్‌ మీడియాలో ఆమెను పెద్ద ఎత్తున ట్రోల్‌ చేశారు. దీంతో రష్మిక ఆ వ్యాఖ్యలపై బహిరంగంగా క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే.

వివరాలు

విడుదలకు సిద్ధమైన టాక్సిక్..

ఇక యశ్‌ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన నటించిన 'టాక్సిక్' విడుదలకు సిద్ధమవుతోంది.

ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ విడుదల కాగా, అందులోని కొన్ని సన్నివేశాలపై విమర్శలు వచ్చాయి. ఈ అంశంపై కూడా యశ్‌ స్పందించారు.

''నేను అశ్లీలతను ప్రోత్సహించే వ్యక్తిని కాదు. ఈ సినిమాను ప్రస్తుత యువతను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు'' అని యశ్‌ వివరణ ఇచ్చారు.

'టాక్సిక్' చిత్రం ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు నితేశ్‌ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం 'రామాయణ'లో యశ్‌ కీలకమైన రావణుడి పాత్రలో కనిపించనున్నారు.

ADVERTISEMENT