LOADING...
Kamal Haasan-Rajinikanth: కమల్‌-రజనీకాంత్‌ మల్టీస్టారర్‌పై క్లారిటీ ఇచ్చిన యువ దర్శకుడు ప్రదీప్‌ రంగనాథన్
కమల్‌-రజనీకాంత్‌ మల్టీస్టారర్‌పై క్లారిటీ ఇచ్చిన యువ దర్శకుడు ప్రదీప్‌ రంగనాథన్

Kamal Haasan-Rajinikanth: కమల్‌-రజనీకాంత్‌ మల్టీస్టారర్‌పై క్లారిటీ ఇచ్చిన యువ దర్శకుడు ప్రదీప్‌ రంగనాథన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 07, 2025
09:04 am

ఈ వార్తాకథనం ఏంటి

తమిళ సినీ పరిశ్రమలో అగ్రతారలు రజనీకాంత్‌ (Rajinikanth), కమల్‌ హాసన్‌ (Kamal Haasan) 46 ఏళ్ల తర్వాత ఒకే తెరపై కనిపించబోతున్న విషయం ఇప్పటికే సినీ అభిమానుల్లో విపరీతమైన ఆసక్తిని రేపింది. ఈ భారీ మల్టీస్టారర్‌ ప్రాజెక్ట్‌ అధికారికంగా ప్రకటించిన తర్వాత సోషల్‌ మీడియాలో దీనిపై పలు వార్తలు వైరల్‌గా మారుతున్నాయి. ఈ చిత్రానికి యువ దర్శకుడు ప్రదీప్‌ రంగనాథన్‌ (Pradeep Ranganathan) దర్శకత్వం వహించనున్నట్లు వార్తలు వెలువడగా, తాజాగా ఆయన ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. తాను రజనీకాంత్‌-కమల్‌ హాసన్‌ ప్రాజెక్ట్‌లో భాగం కాదని ప్రదీప్‌ స్పష్టం చేశారు. 'ఆ సినిమాకు నాకు ఆఫర్‌ వచ్చిందో లేదో చెప్పలేను.

Details

దర్శకత్వం  కంటే నటనపైనే ఎక్కువ దృష్టి

కానీ నేను ఆ ప్రాజెక్ట్‌లో లేను. ప్రస్తుతం నేను దర్శకత్వం కంటే నటనపై ఎక్కువ దృష్టి పెట్టాలనుకుంటున్నాను. కమల్‌-రజనీకాంత్‌ సినిమా గురించి అంతకంటే ఎక్కువ చెప్పడం ఇష్టం లేదని తెలిపారు. అలాగే రజనీకాంత్‌ పట్ల తన అభిమానాన్ని కూడా వ్యక్తం చేశారు. 'నేను ఆయనకు పెద్ద అభిమాని. ఆయన ప్రతి సినిమా మొదటి రోజు, మొదటి షో చూస్తాను. 'డ్రాగన్‌' విడుదలైన తర్వాత రజనీ సర్‌ నన్ను అభినందించారు. ఆ మాటలు నేను ఎప్పటికీ మర్చిపోలేనని ప్రదీప్‌ చెప్పారు. ఇక ఇటీవల జరిగిన సైమా అవార్డుల కార్యక్రమంలో కమల్‌ హాసన్‌ ఈ బిగ్‌ మల్టీస్టారర్‌పై అధికారికంగా స్పందించారు.

Details

ఆ సినిమా ప్రేక్షకులకు పెద్ద సర్‌ప్రైజ్‌ అవుతుంది

వ్యాఖ్యాత అడిగిన "మీరు రజనీకాంత్‌తో కలిసి సినిమా చేసే ఆలోచన ఉందా?" అనే ప్రశ్నకు కమల్‌ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. 'ప్రేక్షకులు మా కాంబినేషన్‌ను ఇష్టపడితే అది మాకు ఆనందం. మేమిద్దరం కలిసి నటించాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాం, కానీ ఇప్పటివరకూ సాధ్యం కాలేదు. ఇక త్వరలోనే మీ ముందుకు కలసి రానున్నాం. ఆ సినిమా ప్రేక్షకులకు పెద్ద సర్‌ప్రైజ్‌ అవుతుందని వెల్లడించారు. ఈ ప్రకటనతో రజనీకాంత్-కమల్‌ హాసన్‌ మల్టీస్టారర్‌ అధికారికంగా ఖరారైంది.