Zee Telugu : సినిమా, సీరియల్స్, షోలతో 'జీ తెలుగు' మళ్లీ సందడి చేసేందుకు సిద్ధం!
ఈ వార్తాకథనం ఏంటి
జీ తెలుగు వరుసగా సూపర్ హిట్ సినిమాలు, వినూత్న కాన్సెప్ట్‌లతో ఫిక్షన్, నాన్-ఫిక్షన్ షోల ద్వారా ప్రేక్షకులను అలరిస్తోంది.
ఇప్పుడు మరోసారి ట్రిపుల్ బొనాంజా ఎంటర్టైన్మెంట్‌తో ముందుకు రాబోతోంది.
ఈ ఏడాది సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం చేసేందుకు సిద్ధమైంది.
అంతేకాదు సూపర్ సీరియల్ ఛాంపియన్‌షిప్ అనే రియాలిటీ షోతో పాటు, కుటుంబ కథాంశంతో ఆకట్టుకునే లక్ష్మీ నివాసం అనే కొత్త సీరియల్‌ను ప్రారంభించనుంది.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా మార్చి 1 (శనివారం) సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది.
Details
సీరియల్ ప్రసార సమయాల్లో స్వల్ప మార్పులు
ఇక ప్రముఖ నటులు శ్రీకాంత్, రోజా, రాశి, అనిల్ రావిపూడి అతిథులుగా హాజరయ్యే సూపర్ సీరియల్ ఛాంపియన్‌షిప్ గ్రాండ్ లాంచ్ మార్చి 2న సాయంత్రం 6 గంటలకు జరగనుంది.
మరోవైపు ప్రేమ, బాధ్యత, బంధాలను ప్రధానంగా చూపించే కొత్త ఫ్యామిలీ సీరియల్ 'లక్ష్మీ నివాసం' మార్చి 3 (సోమవారం) రాత్రి 7 గంటలకు ప్రసారం కానుంది.
'లక్ష్మీ నివాసం' ప్రారంభంతో జీ తెలుగు ఇతర సీరియల్ ప్రసార సమయాల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకోనున్నాయి.
మార్చి 3వ తేదీ నుంచి 'నిండు నూరేళ్ల సావాసం' సాయంత్రం 6:30 గంటలకు, 'మా అన్నయ్య' సాయంత్రం 6 గంటలకు, 'చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి' మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రసారం కానున్నాయి.