తదుపరి వార్తా కథనం

దేశంలో కొత్తగా 1,690 కరోనా కేసులు; 12మంది మృతి
వ్రాసిన వారు
Stalin
May 11, 2023
10:37 am
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో కరోనా కొత్త కేసులు భారీగా తగ్గాయి. యాక్టివ్ కేసులు కూడా 20వేల లోపు చేరుకోవడం గమనార్హం.
గత 24గంటల్లో దేశంలో 1,690 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది.
కొత్త కేసులతో కలిపి యాక్టివ్ కేసులు 19,613కి తగ్గినట్లు కేంద్రం వెల్లడించింది.
దేశంలో ప్రస్తుతం కోవిడ్-19 కేసుల సంఖ్య 4.49 కోట్ల(4,49,76,599)కు చేరుకుంది. అలాగే దేశంలో కరోనాతో కొత్తగా 12మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
జాతీయ కోవిడ్ -19 రికవరీ రేటు 98.77 శాతంగా నమోదైందని మంత్రిత్వ శాఖ తెలిపింది. వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,44,25,250 కు పెరిగింది. అయితే మరణాల రేటు 1.18 శాతంగా ఉంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
దేశంలో యాక్టివ్ కేసులు 19,613
Covid-19 | 1,690 new cases in India in the last 24 hours; Active caseload at 19,613
— ANI (@ANI) May 11, 2023