
మామిడిలోనే రారాజు మియాజాకి రకం.. కేజీ అక్షరాల 2,75,000 రూపాయలు
ఈ వార్తాకథనం ఏంటి
మియాజాకి మామిడి పండు అంటే ఊదారంగులో కనిపిస్తుంది. కానీ ఈ మామిడికి ఉన్న డిమాండ్ వేరే ఏ మామిడికి లేదంటే నమ్ముతారా. కిలో మియాజాకి మామిడి పండ్లు వంద రూపాయలు కాదు వెయ్యి రూపాయలు అంతకంటే కాదు.
ఈ అద్భుత పండు ధర అక్షరాల 2 లక్షల 75 వేల రూపాయలు అంటే ఎవరైనా ఇట్టే ఆశ్చర్యపోతారు మరి.
పశ్చిమ బెంగాల్ లోని సిలిగురిలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్ల ప్రదర్శన నిర్వహించారు.
అందులో మియాజాకి రకానికి చెందిన ఈ మామిడినీ ప్రదర్శించారు.
7వ మ్యాంగో ఫెస్టివల్ లో భాగంగా మూడు రోజుల పాటు వీటిని ప్రదర్శించనున్నారు.
DETAILS
మియాజాకిలో పోషక విలువలు అమోఘం
ఒక్కో మియాజాకి పండు సుమారు 900 గ్రాముల వరకు ఉంటుందని అంచనా. అయితే ప్రపంచంలోనే తొలుత ఈ పండును ఆసియాలోని జపాన్ లోనే పండించారు.
ఈ పండు ముందుర వేరే ఏ మామిడి రుచి సాటిరాదని అంటారు. అందుకే దీన్ని మామిడి పండ్లలో రారాజు అంటారు. ఇందులో ఉండే పోషక విలువలు అన్నీ ఇన్నీ కాదు.
మానవ శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, విటమిన్లు, కాల్షియం, ఐరన్, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్ లాంటి పోషకాలను పుష్కలంగా కలిగి ఉంది.
ఈ మామడి పండును తీసుకుంటే క్యాన్సర్ కారక రిస్కులు సైతం తగ్గుతాయనే పేరును మియాజాకి గడించింది.