Karnataka: డిప్యూటీ స్పీకర్‌ను అగౌరవపర్చిన 10మంది బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు
కర్ణాటక అసెంబ్లీలో బుధవారం అగౌరవంగా ప్రవర్తించిన 10మంది బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేసినట్లు కాంగ్రెస్ పేర్కొంది. తదుపరి అసెంబ్లీ సమవేశాలకు ఆ పది మందిని సస్పెండ్ చేసినట్లు స్పీకర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సభలో గందరగోళం సృష్టించి, అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుల కాపీలను చించి, వాటిని డిప్యూటీ స్పీకర్ రుద్రప్ప లమానిపై విసిరారని కాంగ్రెస్ సభ్యలు ఆరోపించారు. బెంగళూరులో రెండు రోజుల పాటు జరిగిన విపక్షాల సదస్సుకు హాజరైన నేతలను స్వాగతించే బాధ్యతలను రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నతాధికారులకు అప్పగించడాన్ని నిరసిస్తూ బీజేపీ శాసనసభ్యులు సభలో నిరసన తెలిపారు. ఈ నిరసనల మధ్యే సభలో ఐదు బిల్లులు ఆమోదం పొందాయి.
దళితుడైనందుకే నన్ను లక్ష్యం చేసుకున్నారు: డిప్యూటీ స్పీకర్
వాస్తవానికి బ్రిక్స్ సదస్సుకు రావాల్సిందిగా పుతిన్‌కు దక్షిణాఫ్రికా ఆహ్వానం పంపింది. అయితే దక్షిణాఫ్రికాలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ అయిన డెమోక్రటిక్ అలయన్స్ పుతిన్ రాకను తీవ్రంగా వ్యతిరేకించింది. పుతిన్ వస్తే అతనిని అరెస్టు చేయాలని ప్రతిపక్ష నేతలు కోర్టుకు వెళ్లారు. పుతిన్‌ను అరెస్టు చేస్తే, అది రష్యాపై యుద్ధ ప్రకటన అవుతుందని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు భావించారు. యుద్ధ నేరాల కింద ఇప్పటికే పుతిన్‌పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్(ఐసీసీ) అరెస్టు వారెంట్ జారీ చేసింది. పుతిన్ రష్యా గడ్డను విడిచిపెట్టినట్లయితే అతన్ని అరెస్టు చేసేందుకు ఐసీసీ ఎదురుచూస్తోంది. ఐసీసీ పరిధిలో ఉన్న దేశాల్లో దక్షిణాఫ్రికా ఒకటి. ఈ క్రమంలో తమ దేశానికి రావొద్దని దక్షిణాఫ్రికా పుతిన్‌ను కోరింది. దీంతో పుతిన్ సదస్సుకు హాజరవడం లేదు.