
Manipur: మయన్మార్ సరిహద్దుల్లో మిలిటెంట్ల కదలికలు.. అసోం రైఫిల్స్ ఆపరేషన్‌లో 10 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
ఈశాన్య భారతదేశంలోని మణిపూర్ రాష్ట్రంలో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో పది మంది మిలిటెంట్లు మృతి చెందారు.
చందేల్ జిల్లాలో అసోం రైఫిల్స్ బలగాలు, మిలిటెంట్ల మధ్య తీవ్రంగా కాల్పులు జరగాయని భద్రతా శాఖ వెల్లడించింది.
ఈ ఘర్షణలో హతమయ్యినవారు మావోయిస్టులేనని సమాచారం. భారత సైన్యం ప్రకారం, భారత్-మయన్మార్ సరిహద్దుకు సమీపంలో ఉన్న న్యూ సమ్తాల్ గ్రామం వద్ద ఆయుధాలతో సంచరిస్తున్న మిలిటెంట్ల కదలికలపై నిఘా వర్గాలు సమాచారాన్ని అందించాయి.
దీంతో స్పియర్ కార్ప్స్‌కు చెందిన అసోం రైఫిల్స్ యూనిట్ మే 14, 2025న ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది.
వివరాలు
పది మంది మిలిటెంట్లు మృతి
ఈ ఎన్‌కౌంటర్‌పై ఈస్ట్ కమాండ్ అధికారికంగా తన ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ,''చందేల్ జిల్లాలోని ఖెంగ్‌జాయ్ తేహ్సీల్ పరిధిలో ఉన్న న్యూ సమ్తాల్ గ్రామం సమీపంలో మిలిటెంట్ల కదలికలపై నిఘా సమాచారాన్ని ఆధారంగా చేసుకొని అసోం రైఫిల్స్ బలగాలు ఆపరేషన్ ప్రారంభించాయి'' అని పేర్కొంది.
ఆపరేషన్ జరుగుతున్న సమయంలో మిలిటెంట్లు భద్రతా బలగాలపై కాల్పులకు పాల్పడ్డారు.
దాంతో జవాన్లు తక్షణమే ఎదురుకాల్పులు ప్రారంభించి వ్యూహాత్మకంగా తిరిగి చర్యలు చేపట్టారు.
ఈ కాల్పుల్లో మొత్తం పది మంది మిలిటెంట్లు మృతిచెందినట్లు ఆర్మీ తెలిపింది.
సంఘటనా స్థలంలో పెద్దఎత్తున ఆయుధాలు,తూటాలు భద్రతా బలగాల చేతిలో పట్టుబడ్డాయి.
హతమైన మిలిటెంట్ల వివరాలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
ప్రస్తుతం ఈఘటన కొనసాగుతున్న ఆపరేషన్‌లో భాగంగా చోటుచేసుకున్నదని అధికార వర్గాలు వెల్లడించాయి.