Page Loader
AP SCC Evaluation: పదో తరగతి వాల్యూయేషన్ లోపాలు.. ఏపీ బోర్డు కీలక నిర్ణయం
పదో తరగతి వాల్యూయేషన్ లోపాలు.. ఏపీ బోర్డు కీలక నిర్ణయం

AP SCC Evaluation: పదో తరగతి వాల్యూయేషన్ లోపాలు.. ఏపీ బోర్డు కీలక నిర్ణయం

వ్రాసిన వారు Jayachandra Akuri
May 31, 2025
10:14 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనంలో జరిగిన లోపాలపై రాష్ట్ర విద్యాశాఖ కీలక చర్యలు తీసుకుంది. మూల్యాంకన ప్రక్రియలో అనేక తప్పిదాలు చోటుచేసుకున్నట్లు గుర్తించి, ఐదుగురు ఎవాల్యూయేటర్లపై శాఖ వేటు వేసింది. వారి సేవలను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకుంది. విద్యాశాఖ తెలిపిన వివరాల ప్రకారం, మార్కుల కేటాయింపు సమయంలో తీవ్రమైన లోపాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో, రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ ప్రక్రియలపై తీవ్రంగా దృష్టి సారించారు.

Details

ట్రిపుల్ ఐటీ అడ్మిషన్ల గడువు పెంపు

ఈ రెండు ప్రక్రియలకు సంబంధించిన ఫలితాలను జూన్ 1న విడుదల చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు రీవాల్యూయేషన్‌కు 64,251 దరఖాస్తులు, రీవెరిఫికేషన్‌కు 2,112 దరఖాస్తులు అందినట్లు విద్యాశాఖ పేర్కొంది. ఇక, మరోవైపు ట్రిపుల్ ఐటీ (IIIT) ప్రవేశాలకు గడువు ముగిసిన నేపథ్యంలో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. దీనిని పరిగణలోకి తీసుకున్న విద్యాశాఖ, ట్రిపుల్ ఐటీ అడ్మిషన్ల గడువును జూన్ 5 నుంచి 10 వరకు పొడిగించాలని ప్రతిపాదించింది. విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా త్వరలో దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.