LOADING...
Kakinada: కాకినాడ పోర్టుకు 10వ ప్రమాద హెచ్చరిక.. మరో  గంటల్లో తీరం దాటనున్న మొంథా తుఫాను 
మరో  గంటల్లో తీరం దాటనున్న మొంథా తుఫాను

Kakinada: కాకినాడ పోర్టుకు 10వ ప్రమాద హెచ్చరిక.. మరో  గంటల్లో తీరం దాటనున్న మొంథా తుఫాను 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 28, 2025
06:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

మొంథా తుపాన్‌ మరికొద్ది గంటల్లో తీరాన్ని తాకనుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాలు తుఫాను ప్రభావంతో తీవ్ర వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. మరో గంటలో కాకినాడ సమీపంలో తుఫాను తీరం దాటనుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో కాకినాడ పోర్టుకు 10వ నంబర్ అత్యంత ప్రమాద స్థాయి హెచ్చరిక జారీ చేశారు. ఇక, ఈ పోర్టులకు జారీ చేసే హెచ్చరికలు అంటే ఏమిటి? అవి ఎన్ని రకాలుగా ఉంటాయి? అనే వివరాలు చూద్దాం. తుఫాను తీవ్రతను బట్టి భారత వాతావరణ శాఖ 1 నుండి 11 వరకు ఉన్న హెచ్చరిక స్థాయులను 4 వర్గాలుగా (కేటగిరీలుగా) విభజించి పోర్టులకు జారీ చేస్తుంది.

వివరాలు 

A. ముప్పు దూరం (Distant bad weather):

1. పీడనం పోర్టు ప్రాంతానికి దూరంగా ఉంటుంది. 2. సముద్రంలో తుఫాను కొనసాగుతుండగా, పోర్టు నుంచి బయలుదేరే నౌకలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తారు. B: ముప్పు దగ్గరగా (Local Bad Weather): 1. పోర్టు పరిసరాల్లో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంటుంది. 2. తుఫాను ప్రభావం నేరుగా పోర్టుపై పడే ప్రమాదం ఉంటుంది. C: ప్రమాద సంకేతం (Danger): 1. తుఫాను పోర్టుకు ఎడమ వైపున తీరం దాటే అవకాశం ఉంది. 2. కుడి వైపు తీరం దాటవచ్చు. 3. పోర్టు సమీపంలో లేదా దాని మీదుగా తుఫాను దాటే ప్రమాదం ఉంది.

వివరాలు 

D: పెను ప్రమాదం (Great danger): 

1. భారీ తుఫాను పోర్టు ఎడమ వైపున తీరం దాటనుంది. 2. కుడివైపున దాటే అవకాశం ఉంది. 3. పోర్టు దగ్గరగానో లేదా దాని మీదుగానో తుఫాను దాటే పరిస్థితి ఉంటుంది. 4. తుఫానుతో కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంది. ఈ హెచ్చరికల ఆధారంగా అధికారులు నిరంతరం అలర్ట్‌లు జారీ చేస్తూ, ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం కూడా అన్ని రక్షణ చర్యలు, అత్యవసర ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది.