Kerala: కేరళలో రుతుపవనాల ప్రభావం.. ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్
కేరళలో రుతుపవనాల ప్రభావం బాగా కనిపిస్తోంది.భారత వాతావరణ శాఖ (IMD) ఆ రాష్ట్రంలో ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. దీంతో కేరళ మొత్తం వాతావరణం మారిపోయింది. ముఖ్యంగా తిరువనంతపురం,కొల్లామ్, అల్ పూజా, ఎర్నాకుళం,కోజీ కోడ్,కన్నూర్,కాసర్ గడ్ జిల్లాల్లో భారీ వర్ష సూచన ఉందంది. ఆరునుంచి 11సెంటీ మీటర్ల వర్షం పడవచ్చని ఐఎండీ తెలిపింది. మే 9 నుంచి 23 వరకు వర్షాల కారణంగా 11మంది చనిపోయారు. వీటిలో ప్రమాదవ శాత్తూ నీట మునిగి, పిడుగులు,క్వారీ కూలిన ఘటనలు,ఇళ్లు కూలి మృత్యువాత పడ్డారని రెవెన్యూ మంత్రి కె.రాజన్ తెలిపారు.
తీరప్రాంతాలకు ,చెరువుల దగ్గరకు వెళ్ల వద్దని విజ్ఞప్తి
శనివారం నాటికి వర్షాల ప్రభావం తగ్గుతుందన్నారు.అందువల్ల ఎవరూ తీరప్రాంతాలకు ,చెరువుల దగ్గరకు వెళ్ల వద్దని విజ్ఞప్తి చేశారు. వేసవి సెలవుల వల్ల ఇంటి వద్ద వున్న చిన్నారులు జాగ్రత్తగా వుండాలని సూచించారు. స్ధానిక రెవిన్యూ సిబ్బంది, ఫైర్ , పోలీసు , జాతీయ విపత్తు నివారణా బృందాలు అప్రమత్తంగా వున్నాయన్నారు. కాగా శుక్రవారం నాడు 223 మందిని సహాయక శిబిరాలకు తరలించామని రాజన్ వివరించారు.