మధ్యప్రదేశ్: 12ఏళ్ల బాలికపై అత్యాచారం.. ఒంటిపై బట్టలు లేకుండా, రక్తంతో రొడ్డుపై..
ఈ వార్తాకథనం ఏంటి
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో హృదయ విదారక ఉదంతం వెలుగులోకి వచ్చింది.
12ఏళ్ల బాలికపై దారుణంగా అత్యాచారం చేశారు. అంతేకాదు ఆమెను దారుణంగా హింసించారు.
శరీరంపై రక్తపు గాయాలతో బట్టలు లేకుండా నగరంలోని వీధుల్లో తిరుగుతున్న బాలిక వీడియో స్థానిక సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది.
వీడియోలో ఆమె తన చేతులతో తన శరీరాన్ని కప్పుకొని, ప్రజల నుండి సహాయం కోసం వేడుకోవడం కనిపించింది.
అయితే ఆమెకు చేయూతనందించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం.
బాద్నగర్ రోడ్ మురళీపురా సమీపంలో ఈ బాలికను గుర్తించిన పోలీసులు ఆమెను వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. ఘటనపై విచారణకు సిట్‌ను ఏర్పాటు చేశారు.
అత్యాచారం
ప్రైవేట్ భాగాలపై గాయాలు
ఆ చిన్నారిపై అత్యాచారం జరిగినట్లు మెడికల్ రిపోర్టులో తేలింది. అంతేకాదు, అమ్మాయి ప్రైవేట్ భాగాలపై తీవ్ర గాయాలైన విషయం వెలుగులోకి వచ్చింది.
అత్యాచారం అనంతరం అధిక రక్తస్రావమైనట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆమె పరిస్థితి విషమంగా ఉందని మెడికల్ రిపోర్టులో తేలింది.
మెరుగైన వైద్యం కోసం బాలికను ఇండోర్‌కు రెఫర్ చేశారు.
అత్యాచారానికి గురైన బాలిక స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్. బాలిక ఉజ్జయిని ఎలా చేరుకుంది, ఆమె అత్యాచారానికి ఎలా గురైంది అనే దానిపై పోలీసులు విచారిస్తున్నారు.
చిన్నారి ఓ ఆటోడ్రైవర్‌తో కనిపించినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
తనపై అత్యాచారం జరిగిన తర్వాత ప్రాణాలు కాపాడుకునేందుకు పారిపోయానని ఆ బాలిక పోలీసులకు తెలిపింది.