NIA raids: మహారాష్ట్ర, కర్ణాటకలో ఎన్‌ఐఏ దాడులు.. 13 మంది అరెస్ట్
NIA raids in Maharashtra, Karnataka: ఇస్లామిక్ స్టేట్ (ISIS-ఐసీస్) ఉగ్రవాద గ్రూపు కుట్ర కేసులో మహారాష్ట్ర, కర్ణాటకలోని 41 ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ విస్తృతమైన దాడులు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో ఇప్పటివరకు పుణేకు చెందిన 13 మందిని అధికారులు అరెస్టు చేసింది. వీరికి ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధం ఉన్నట్లు అధికారులు చెప్పారు. కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో.. మహారాష్ట్రలో పూణె, థానే రూరల్, థానే సిటీ, మీరా భయాందర్‌లలో తనిఖీలు కొనసాగుతున్నాయి. దేశంలో భారీ ఉగ్రవాద కుట్రకు ఐసీస్ పథక రచన చేయగా నిఘా వర్గాలు భగ్నం చేశాయి. ఆ కేసులో ఐసీస్‌తో సంబంధం ఉన్న వారిపై ఉక్కుపాదం మోపేందుకు ఎన్ఐఏ ఈ దాడులను నిర్వహిస్తోంది.