
Wolf Attacks: ఆగని తోడేళ్ల దాడులు.. ఈసారి 13 ఏళ్ల బాలునిపై దాడి
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో నరమాసం భక్షక తోడేళ్ల భీభీత్సం ఆగడం లేదు.
ఇప్పటికే ఐదు తోడేళ్లను పట్టుకున్న ఆటవీ శాఖ అధికారులు చివరి తోడేలు కోసం గాలిస్తూనే ఉన్నారు.
తాజాగా ఆదివారం రాత్రి జరిగిన ఈ దాడిలో 13 ఏళ్ల అర్మాన్ అలీపై తోడేలు దాడి చేసింది.
తన ఇంటి టెర్రస్‌పై నిద్రిస్తున్న సమయంలో తోడేలు అతడిపై దాడి చేయడంతో అతని మెడ, భుజాలకు గాయాలయ్యాయి.
స్థానిక ఆరోగ్య కేంద్రంలో ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత, అతని గాయాల తీవ్రత కారణంగా భరైచ్ మెడికల్ కాలేజీకి తరలించారు.
Details
తోడేళ్ల దాడుల్లో ఇప్పటివరకూ 10 మంది మృతి
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బహ్రైచ్‌లో ఏరియల్ సర్వే నిర్వహించారు.
అయితే తోడేళ్ల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను కలిసిన కొద్ది గంటల తర్వాత చోటు చేసుకోవడం గమనార్హం.
ఇప్పటి వరకు బహ్రైచ్‌లో తోడేళ్ల దాడుల్లో 10 మంది ప్రాణాలు కోల్పోగా, 35 మందికి పైగా గాయపడ్డారు.
జూలై 17న మొదటి దాడి జరిగినప్పటి నుంచి ప్రతి నాలుగు నుంచి ఐదు రోజులకు ఇదే తరహా దాడులు జరుగుతున్నాయి.
ప్రజల భద్రత కోసం ప్రభుత్వం 165 మంది అటవీ సిబ్బందితో 25 బృందాలను నియమించడమే కాకుండా, పర్యవేక్షణ కోసం నాలుగు థర్మల్ డ్రోన్‌లను కూడా వినియోగిస్తోంది.