Page Loader
Kolkata: కోల్‌కతా హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం 14 మంది మృతి.. పలువురికి గాయాలు
కోల్‌కతా హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం 14 మంది మృతి.. పలువురికి గాయాలు

Kolkata: కోల్‌కతా హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం 14 మంది మృతి.. పలువురికి గాయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 30, 2025
08:40 am

ఈ వార్తాకథనం ఏంటి

కోల్‌కతాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం సెంట్రల్ కోల్‌కతాలోని ఓ హోటల్‌లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. మంటల్ని పూర్తిగా అదుపులోకి తెచ్చినట్లు కోల్‌కతా పోలీస్ కమిషనర్ మనోజ్ కుమార్ వర్మ విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు. ఇప్పటివరకు 14 మృతదేహాలను వెలికితీసినట్లు పేర్కొన్నారు. ఈ దుర్ఘటనకు సంబంధించిన కారణాలపై దర్యాప్తు నడిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అయితే ప్రస్తుతానికి మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చినట్లు తెలిపారు.

వివరాలు 

అగ్నిమాపక శాఖ సమర్థవంతమైన భద్రతా చర్యలు తీసుకోవాలి 

ఈ విషాద ఘటనపై కేంద్ర మంత్రి, పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ స్పందించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మరల జరగకుండా అగ్నిమాపక శాఖ సమర్థవంతమైన భద్రతా చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. ప్రమాదంలో గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. అలాగే మృతుల కుటుంబాలకు తగిన ఆర్థిక సాయం అందించాలన్నారు. ఇదిలా ఉండగా, పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు శుభాంకర్ సర్కార్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. కోల్‌కతా కార్పొరేషన్ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. భద్రతా ప్రమాణాలను విస్మరించి కార్పొరేషన్ వ్యవహరిస్తోందని ఆరోపించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కోల్‌కతా హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం