Page Loader
మణిపూర్ లో ఘోర విషాదం.. టూరిస్టు బస్సు ఢీకొని..
బోల్తా పడిన బస్సు

మణిపూర్ లో ఘోర విషాదం.. టూరిస్టు బస్సు ఢీకొని..

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 21, 2022
04:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

మణిపూర్ ఘోర విషాదం చోటు చేసుకుంది. విహార యాత్రకు వెళ్తున్న రెండు టూరిస్టు బస్సులు అదుపు తప్పి బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులు అక్కడిక్కడే మృతి చెందారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు గాయపడినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటన మణిపూర్‌లోని నోనీ జిల్లాలో చోటు చేసుకుంది. తంబల్ను హయ్యర్ సెకండరీ స్కూల్‌కు చెందిన విద్యార్థులు స్టడీ టూర్‌ కోసం ఖౌపుమ్‌కు రెండు బస్సుల్లో వెళ్తున్నారు. ఈ క్రమంలో లాంగ్‌సాయి టుబంగ్‌ గ్రామ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడిపోయాయి. దీంతో పెను ప్రమాదం జరిగింది. ఇక, ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులు మృతిచెందగా.. పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మణిపూర్

మణిపూర్ సీఎం దిగ్ర్భాంతి

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. ఈ ప్రమాదంలో మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంపై మణిపూర్‌ ముఖ్యమంత్రి ఎన్‌ బీరేన్‌సింగ్‌ విచారం వ్యక్తం చేశారు. పాత కచర్ల రోడ్డులో పాఠశాల బస్సులు ప్రమాదానికి గురికావడం బాధాకరమన్నారు. వెంటనే గాయపడిన విద్యార్థులకి మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందికి ఆదేశించారు.ఈ ప్రమాదం తర్వాత అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎస్‌డిఆర్‌ఎఫ్, వైద్యబృందం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.