
Operation Sindoor: యూపీలో 17 మంది నవజాత శిశువులకు 'సిందూర్' అని అని నామకరణం.. ఇది కదా దేశభక్తి అంటే..
ఈ వార్తాకథనం ఏంటి
ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయిన ఘటన తర్వాత, భారత సైన్యం చేపట్టిన ప్రతిఘటన ఆపరేషన్‌ను "ఆపరేషన్ సిందూర్"గా పిలిచారు.
ఈ పేరును దేశవ్యాప్తంగా ప్రజలు గౌరవంగా స్వీకరిస్తున్నారు. పలు ప్రాంతాల్లో తల్లిదండ్రులు తమ కొత్తగా జన్మించిన కుమార్తెలకు 'సింధూర్' అని పేరు పెట్టడం ద్వారా దేశభక్తిని చాటుకుంటున్నారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని కుషినగర్ జిల్లాలో ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది.
మే 7 తర్వాత స్థానిక హాస్పిటల్‌లో రెండు రోజుల్లో జన్మించిన 17 మంది ఆడ శిశువులకు వారి తల్లిదండ్రులు 'సింధూర్' అనే పేరు పెట్టారు.
భారత త్రివిధ దళాలు ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్‌కు గట్టి బుద్ధి చెప్పిన తరుణంలో, ప్రజల్లో దేశభక్తి భావం ఉప్పొంగిపోతోంది.
వివరాలు
ఆపరేషన్ విజయాన్ని గుర్తును నిలిపేలా 'సింధూర్'
కుషినగర్ ప్రజలలో దేశభక్తి జ్వాలలు ఉదృతంగా కనిపిస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్న సమయంలోనే, తమ కుమార్తెలకు 'సింధూర్' అని పేరు పెట్టడం ద్వారా మహిళలు సైనికులకు మద్దతు తెలుపుతున్నారు.
తామంతా ఫ్రంట్‌లైన్‌లో పోరాడకపోయినా, తమ పిల్లల పేర్ల ద్వారా దేశాన్ని ప్రేమిస్తున్నామన్న సందేశాన్ని పంపిస్తున్నారు.
ఈ ఆపరేషన్ విజయాన్ని గుర్తును నిలిపేలా 'సింధూర్' అనే పదం ప్రజల గుండెల్లో ఒక భావోద్వేగంగా మారింది. కొన్ని కుటుంబాలు తమ కూతుళ్లకు ఈ పేరు పెట్టడంపై గర్వంతో మాట్లాడారు.
ఉదాహరణకు,నగరానికి చెందిన మదన్ గుప్తా తన కోడలు జన్మనిచ్చిన మనవరాలికి 'సింధూర్' అని పేరు పెట్టారు.
దేశభక్తితో కూడిన ఈ ఆపరేషన్ స్ఫూర్తిగా మారిందని ఆయన తెలిపారు.
వివరాలు
పేరు పెట్టడం గర్వకారణం
అలాగే, సదర్ తహసీల్‌లోని ఖాన్వర్ బక్లోహి గ్రామానికి చెందిన నేహా మే 9న ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆమె కూడా తన కుమార్తెకు అదే పేరును పెట్టింది.
అంతేకాదు,భాతి బాబు గ్రామానికి చెందిన వ్యాస్ ముని భార్య కూడా కూతురికి జన్మనిచ్చింది.
వారి కుమార్తె పేరు కూడా 'సింధూర్'. ఖడ్డా తహసీల్‌లోని భేడిహరి గ్రామానికి చెందిన అర్చన మాట్లాడుతూ, తమ కూతురికి ఈ పేరు పెట్టడం తమకు గర్వకారణమని చెప్పారు.
వివరాలు
మొత్తం 17 మంది బాలికలకు 'సింధూర్' పేరు
ఖడ్డా ప్రాంతానికి చెందిన రీనా కూడా తన కూతురికి అదే పేరు పెట్టారు.
ఇంకొక ఉదాహరణగా, పద్రౌనాలోని నహర్ చాప్రా గ్రామానికి చెందిన ప్రియాంక తన నవజాత కుమార్తెకు 'సింధూర్' అని పేరు పెట్టింది.
మే 7 నుంచి 9 తేదీల మధ్య జన్మించిన మొత్తం 17 మంది బాలికలకు 'సింధూర్' అనే పేరు పెట్టారని, కుషినగర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.కే. షాహి తెలిపారు.
ఇది ఆపరేషన్ విజయంతో ప్రజలలో తలెత్తిన దేశభక్తికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.