Page Loader
Telangana: తెలంగాణాలో మరో 19 కొత్త వంగడాలు సిద్ధం
తెలంగాణాలో మరో 19 కొత్త వంగడాలు సిద్ధం

Telangana: తెలంగాణాలో మరో 19 కొత్త వంగడాలు సిద్ధం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 13, 2024
12:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎటువంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకునే 109 రకాల పంటల కొత్త వంగడాలను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ 109 కొత్త వంగడాల్లో 19 వంగడాలు మాత్రమే తెలంగాణకు అనుకూలమంటూ భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ICAR) తెలిపింది. ఈ వంగడాలలో స్వల్పకాలిక వరితో పాటు మొక్కజొన్న, జొన్న, పప్పులు, చిరుధాన్యాలు, ఉద్యానవన పంటలకు సంబంధించినవి ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణలో 5,922 రకాల వంగడాలున్నాయి. అధిక దిగుబడులే కాక తక్కువ సమయంలోను.. నీటి ఎద్దడి, అధికవర్షాలు, తేమ తదితర ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సాగయ్యే పంటలపై ఎప్పటికప్పుడు పరిశోధనలు సాగుతున్నాయి.

వివరాలు 

తెలంగాణకు అనుకూలమైన వంగడాల వివరాలు

తాజాగా, భారతీయ వరి పరిశోధన సంస్థ (IIRR) నూతన వంగడాలను రూపొందించి, అవి ఏయే రాష్ట్రాలకు అనుకూలమో వెల్లడించింది. తెలంగాణకు అనుకూలమైన వంగడాల వివరాలివే.. వరి: డీఆర్‌ఆర్‌ ధన్‌ 73 (ఐఈటీ-30242), 78 (ఐఈటీ- 30240), ఐఈటీ-30697, కేఆర్‌ 19011. ఈ రకం వంగడాలు తక్కువ నీటి వినియోగించుకొని అధిక దిగుబడినిస్తాయి. ఈ వంగడాలను వినియోగించడమే వల్ల ఎరువుల వినియోగం 40% తగ్గుతుంది. ప్రతికూల వాతావరణంలోనూ సాగవుతాయి. మొక్కజొన్న: పుస పాప్‌కార్న్‌ హైబ్రిడ్‌-1 (ఏపీసీహెచ్‌2), పుస బయోఫోర్టిఫైడ్‌ మెయిజ్‌ హైబ్రిడ్‌-4 (ఏపీసీహెచ్‌4), పుస హెచ్‌ఎం4 మేల్‌ స్టెరైల్‌ బేబీకార్న్‌-2 (ఏబీఎస్‌హెచ్‌4), పుస పాప్‌కార్న్‌ హైబ్రిడ్‌-2 (ఏపీసీహెచ్‌3). ఇతర రకాల కంటే ఇవి 20% అధిక దిగుబడిని ఇస్తాయి.

వివరాలు 

నూతన వంగడాలపై కృషి విజ్ఞాన కేంద్రం ప్రచారం

జొన్న: డీఎస్‌హెచ్‌-6 (సీఎస్‌హెచ్‌-49) (ఎస్‌పీహెచ్‌-1943). శనగ: నంద్యాల్‌ గ్రామ్‌ 1267(ఎన్‌బీఈజీ 1267). బఠాణీ: నామ్‌-88. పెసలు: లామ్‌పెసర 610 (ఎల్‌జీజీ610). నూనె గింజలు: పొద్దుతిరుగుడులో ఐఎస్‌ఎఫ్‌-123-ఎస్‌ఈఎల్‌-15, ఐఎస్‌ఎఫ్‌-300;నువ్వుల్లో తంజీలా (క్యూయూఎంఎస్‌-09ఎ). చిరుధాన్యాలు: ముత్యాల పంటలో జేపీఎం 18-7(జవహర్‌ పెర్ల్‌మిల్లెట్‌ 18-7). కూరగాయలు: టమాటాలో పుసశక్తి, పుస టమాటా హైబ్రిడ్, బంతి పూలలో పుస బాహర్‌. ఈ వంగడాలు రానున్నరబీ సీజన్‌ నుంచి అందుబాటులోకి వస్తాయి. రైతులకు విశ్వవిద్యాలయాలు, విత్తనాభివృద్ధి సంస్థల ద్వారా అందుబాటులో ఉంటాయి. ఐకార్‌ రూపొందించిన ఈ నూతన వంగడాలతో తెలంగాణ రైతులకు అన్నివిధాలా మేలు జరుగుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు వెల్లడించారు. నూతన వంగడాలపై ప్రచారం చేయాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి ఈ బాధ్యతను కృషి విజ్ఞాన కేంద్రాలకు అప్పగించింది.