Page Loader
Delhi: నమ్‌కీన్ ప్యాకెట్లలో ₹2,000 కోట్ల కోట్ల డ్రగ్స్.. ఢిల్లీ వ్యక్తి అరెస్ట్
నమ్‌కీన్ ప్యాకెట్లలో ₹2,000 కోట్ల కోట్ల డ్రగ్స్.. ఢిల్లీ వ్యక్తి అరెస్ట్

Delhi: నమ్‌కీన్ ప్యాకెట్లలో ₹2,000 కోట్ల కోట్ల డ్రగ్స్.. ఢిల్లీ వ్యక్తి అరెస్ట్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 11, 2024
12:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీలో భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఢిల్లీలోని రమేష్ నగర్‌లో పోలీసులు పెద్ద ఎత్తున డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు చేసిన దాడుల్లో 200కిలోల కొకైన్‌ను పట్టుకున్నారు. ఈ కొకైన్‌ విలువ దాదాపు రూ. 2 వేల కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. వారం రోజుల్లో ఇప్పటి వరకు సుమారు 7 వేల కోట్ల విలువైన కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. రమేష్ నగర్‌లో ఉన్న మూసి దుకాణం నుంచి ఈ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నామని,దాదాపు 200 కిలోల డ్రగ్స్ అంతర్జాతీయ మార్కెట్‌లో విలువ రూ.2,000 కోట్లకు పైగా ఉంటుందని చెప్పారు. ఈ డ్రగ్స్‌ను నమ్‌కీన్ ప్యాకెట్లలో దాచినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.

వివరాలు 

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జస్సీ అరెస్టు 

ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు జీపీఎస్ సాంకేతికత ద్వారా డ్రగ్స్ సరఫరాదారుని ట్రాక్ చేసి,పశ్చిమ ఢిల్లీలోని రమేష్ నగర్‌లో ఓ వ్యక్తిని పట్టుకున్నారు. నిందితులు లండన్‌కి పరారైనట్లు వెల్లడించారు.వారం రోజుల్లో రూ.7,500 కోట్ల విలువైన 762 కిలోల డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గత వారం ఢిల్లీలో 500కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.దక్షిణ ఢిల్లీలోని దాడుల్లో డ్రగ్స్‌కు సంబంధించిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జస్సీ అలియాస్ జితేంద్ర పాల్ సింగ్‌ను స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేశారు. అతను లండన్‌కు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. వీరు దేశవ్యాప్తంగా నేరాలు,అక్రమ డ్రగ్స్ స్మగ్లింగ్ చేసే పాన్ ఇండియా నెట్‌వర్క్‌కు సంబంధాలు కలిగి ఉన్నారని పోలీసులు వెల్లడించారు.