LOADING...
దిల్లీ లిక్కర్ స్కామ్.. సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట 
దిల్లీ లిక్కర్ స్కామ్.. సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట

దిల్లీ లిక్కర్ స్కామ్.. సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట 

వ్రాసిన వారు Stalin
Sep 15, 2023
04:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యంతర ఉపశమనం లభించింది. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో శుక్రవారం విచారణకు హాజరు కావాలని కవితకు ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈడీ సమన్లను సవాల్ చేస్తూ కవిత శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో కవిత పిటిషన్‌ను ధర్మానసం విచారణకు స్వీకరించింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు సెప్టెంబర్ 26కి వాయిదా వేసింది. అప్పటి వరకు కవితను విచారించొద్దని ఈడీని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో కవితకు స్వల్ప ఊరట లభించింది. ఫలితంగా కవితను విచారించడాన్ని ఈడీ వాయిదా వేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట