LOADING...
కేరళ: అదుపులో నిపా వైరస్.. కంటైన్మెంట్ జోన్లలో ఆంక్షల సడలింపు 
కేరళ: అదుపులో నిపా వైరస్.. కంటైన్మెంట్ జోన్లలో ఆంక్షల సడలింపు

కేరళ: అదుపులో నిపా వైరస్.. కంటైన్మెంట్ జోన్లలో ఆంక్షల సడలింపు 

వ్రాసిన వారు Stalin
Sep 19, 2023
12:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

కొన్నిరోజులుగా కేరళను కలవరపెడుతున్న నిఫా వైరస్ ప్రస్తుతం అదుపులో ఉన్నట్లు విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది. ఈ మేరకు కోజికోడ్ జిల్లాల్లోని తొమ్మిది పంచాయతీల్లోని కంటైన్‌మెంట్ జోన్లలో ఆంక్షలను సడలిస్తున్నట్లు చెప్పింది. కంటైన్‌మెంట్ జోన్‌లలోని దుకాణాలు రాత్రి 8గంటల వరకు తెరిచి ఉంటాయని అధికారులు వెల్లడించారు. బ్యాంకులు మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేస్తాయని వివరించారు. ఆంక్షలు సడలించినా, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, శానిటైజర్‌లను తప్పనిసరిగా ఉపయోగించాలని, సామాజిక దూరం పాటించాలని అధికారులు పేర్కొన్నారు. కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నవారు కఠినమైన ఆంక్షలను పాటించాలని, ఆరోగ్య శాఖ సూచించిన వ్యవధి వరకు క్వారంటైన్‌లో ఉండాలని కోజికోడ్ జిల్లా కలెక్టర్ తెలియజేశారు. సెప్టెంబర్ 16 నుంచి రాష్ట్రంలో ఒక్క నిఫా వైరస్ నమోదు కాలేదు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సెప్టెంబర్ 16 నుంచి ఒక్క కేసు నమోదు కాలేదు