LOADING...
జనసేనకు గుడ్‌న్యూస్.. తిరిగి 'గాజు గ్లాసు' గుర్తును కేటాయించిన ఎన్నికల సంఘం 
జనసేనకు గుడ్‌న్యూస్.. తిరిగి 'గాజు గ్లాసు' గుర్తును కేటాయించిన ఎన్నికల సంఘం

జనసేనకు గుడ్‌న్యూస్.. తిరిగి 'గాజు గ్లాసు' గుర్తును కేటాయించిన ఎన్నికల సంఘం 

వ్రాసిన వారు Stalin
Sep 19, 2023
04:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. మరోసారి జనసేనకు ఎన్నికల గుర్తుగా గాజు గ్లాసును కేటాయించింది. దీంతో జనసేన పార్టీ నాయకత్వం ఊపిరిపీల్చుకుంది. దీంతో 2024 ఎన్నికల్లో గాజ గ్లాసు గుర్తుపై మరోసారి పోటీ చేయనుంది. తమకు తిరిగి గాజు గ్లాసు గుర్తును కేటాయించడంపై ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు తెలుపుతూ జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. 2019ఎన్నికల్లో జనసేనకు నిర్ణీత ఓట్లు రాకపోవడంతో ఎన్నికల సంఘం ఆ పార్టీ గుర్తును రద్దు చేసింది. ఆ ఎన్నికల్లో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన జనసేన అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్ ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో జనసేన 7శాతం ఓట్లకే పరిమితమైంది.

పవన్

పవన్‌కు కేంద్రంతో ఉన్న పరిచయాలే హెల్ప్ అయ్యాయా?

2019 ఎన్నికల్లో నిర్ణీత ఓటింగ్ షేర్ రాకపోవడంతో జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసును ఎన్నికల సంఘం ఉపసంహరించుకుంది. అప్పుడు దీన్ని పార్టీకి గట్టి ఎదురు దెబ్బగా అంతా భావించారు. కానీ, ఆ సమయంలో జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. తాము న్యాయపరమైన అవకాశాలను అన్వేషిస్తున్నామని, వచ్చే ఎన్నికల్లోనూ అదే గుర్తును తిరిగి పొందుతామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయన చెప్పినట్లుగానే జనసేనకు మళ్లీ అదే గాజుల గుర్తు వచ్చింది. దిల్లీలో పవన్‌కల్యాణ్‌కు ఉన్న పరిచయాలు, కేంద్రంతో ఆయనకున్న మంచి సంబంధాలే 'గాజు' గుర్తును తిరిగి పొందడంలో కీలకపాత్ర పోషించాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జనసేన చేసిన ట్వీట్