Delhi-Congress-Leaders Resigned: ఢిల్లీ కాంగ్రెస్ కు మరో షాక్...ఇద్దరు నేతలు రాజీనామా
ఢిల్లీ (Delhi) కాంగ్రెస్ (Congress) కు మరో పెద్ద దెబ్బ తగిలింది. ఢిల్లీ కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు నాయకులు ఆ పార్టీకి రాజీనామా (resigned) చేశారు. లోక్సభ నియోజకవర్గాలకు పరిశీలకులుగా ఉన్న నీరజ్ బసోయా (Neeraj Basoya), నషీబ్ సింగ్ (Nasheeb Singh) బుధవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆప్ తో పొత్తు పెట్టుకోవడమే అందుకు కారణం అంటూ ఇద్దరూ వేరువేరు లేఖలను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపించారు. నీరజ్ బసోయా వెస్ట్ ఢిల్లీ పార్లమెంటరీ సీటుకు పరిశీలకులుగా ఉన్నారు.
ఆత్మగౌరవమున్నవాడిగా ఆ పార్టీలో కొనసాగలేను: నీరజ్ బసోయా
మాజీ ఎమ్మెల్యే అయిన నీరజ్ బసోయా ఆమ్ ఆద్మీ పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని.. తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా ఆ లేఖలో కోరారు. ఎన్నికల ప్రచారంలో ఆప్ తో పొత్తు గురించి కాంగ్రెస్ శ్రేణులకు సమాధానమివ్వలేకపోతున్నాను అని తెలిపారు. ఆత్మ గౌరవమున్న పార్టీ నేతగా కాంగ్రెస్ పార్టీతో ఇక కొనసాగలేనని ఆ లేఖలో తేల్చి చెప్పారు.