LOADING...
Kerala: కేరళలో విషాదం.. స్పోర్ట్స్ హాస్టల్‌లో ఉరివేసుకుని ఇద్దరు బాలికల ఆత్మహత్య
కేరళలో విషాదం.. స్పోర్ట్స్ హాస్టల్‌లో ఉరివేసుకుని ఇద్దరు బాలికల ఆత్మహత్య

Kerala: కేరళలో విషాదం.. స్పోర్ట్స్ హాస్టల్‌లో ఉరివేసుకుని ఇద్దరు బాలికల ఆత్మహత్య

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 15, 2026
11:18 am

ఈ వార్తాకథనం ఏంటి

కేరళలోని కొల్లం జిల్లాలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) హాస్టల్‌లో గురువారం ఉదయం ఇద్దరు క్రీడా శిక్షణార్థులు ఉరివేసుకుని మృతి చెందిన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హాస్టల్ గదిలో ఇద్దరు బాలికలు ఉరివేసుకున్న స్థితిలో కనిపించారు. మృతులు 17, 15 ఏళ్ల వయస్సు గల బాలికలుగా గుర్తించారు. వీరిలో ఒకరు కోజికోడ్‌కు,మరో బాలిక తిరువనంతపురానికి చెందినవారు. ఉదయం 5 గంటల సమయంలో వీరు శిక్షణకు రాకపోవడంతో అనుమానం వచ్చిన ఇతర హాస్టల్ విద్యార్థులు గది పలుమార్లు తట్టినా స్పందన లేకపోవడంతో హాస్టల్ సిబ్బంది తలుపు పగులగొట్టి లోపలికి వెళ్లారు.

వివరాలు 

గదిలో ఉరివేసుకున్న ఇద్దరు విద్యార్థులు 

గదిలో ఇద్దరూ ఉరివేసుకుని మృతి చెందినట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. 15 ఏళ్ల బాలిక వేరే గదిలో ఉంటుండగా, బుధవారం రాత్రి ఆమె మరో బాలిక గదిలోనే గడిపినట్లు సమాచారం. తెల్లవారుజామున వీరిద్దరినీ ఇతర హాస్టల్ విద్యార్థులు చూసినట్లు పోలీసులు చెప్పారు. 17 ఏళ్ల బాలిక అథ్లెటిక్స్‌లో శిక్షణ పొందుతూ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా, మరో బాలిక కబడ్డీ క్రీడాకారిణి, 10వ తరగతి విద్యార్థినిగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు స్పష్టం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Advertisement