
UP: 48 గంటల్లో యూపీలో 20 ఎన్‌కౌంటర్లు.. నేరస్థులకు దడ పుట్టిస్తున్న సీఎం యోగి
ఈ వార్తాకథనం ఏంటి
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు ఉత్తర్‌ప్రదేశ్ పోలీస్ అధికారులు ఒక విప్లవాత్మక ఆపరేషన్‌ను ప్రారంభించారు. కేవలం 48 గంటల్లో రాష్ట్రం అంతటా నేరస్థులను ఎన్‌కౌంటర్ చేశారు. ఈ చర్యలు 'ఆపరేషన్ లాంగ్డా', 'ఆపరేషన్ ఖల్లాస్' కింద జరిగాయి. నేరాలను తగ్గించడం, నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవడం లక్ష్యంగా ఈ ఆపరేషన్లు చేపట్టారు. మీరట్ నుండి ముజఫర్‌నగర్ వరకు, పోలీసులు నేరస్థులను కాల్పులు జరిపి నేరస్తులను మట్టుబెడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రమంతా ఆపరేషన్‌లాంగ్డా, ఆపరేషన్ ఖల్లాస్ కొనసాగుతున్నాయి. 'ఆపరేషన్ లాంగ్డా' అంటే, ఒక నేరస్థుని కాలిపై కాల్చి అరెస్ట్ చేయడం. 'ఆపరేషన్ ఖల్లాస్' అనేది పెద్ద నేరాలకు పాల్పడిన నేరస్థులను ఎన్‌కౌంటర్ ద్వారా చంపడం.
Details
నేరస్థులపై కఠిన ఆంక్షలు
యూపీ ప్రభుత్వం ప్రకారం, నేరానికి ఏకైక శిక్ష ఎన్‌కౌంటర్. కేవలం 48 గంటల్లో యూపీ పోలీసులు దాదాపు 20 ఎన్‌కౌంటర్లను నిర్వహించారు. ప్రతి ప్రధాన నగరంలో పోలీసులు నేరస్థులపై ఆంక్షలు అమలు చేశారు. మీరట్, ముజఫర్‌నగర్, ఫరూఖాబాద్, ఫిరోజాబాద్, మొరాదాబాద్, మధుర, హర్దోయ్, ఉన్నావ్, ఝాన్సీ, బులంద్‌షహర్, బాగ్‌పత్, బల్లియా, లక్నో, ఘజియాబాద్, షామ్లీ ప్రాంతాల్లో నేరస్థులపై ఎన్‌కౌంటర్లు జరిగాయి.
Details
ఫిరోజాబాద్‌లో మొదటి ఎన్‌కౌంటర్
మొదటి ఎన్‌కౌంటర్ ఫిరోజాబాద్‌లో జరిగింది. రూ. 2 కోట్లు దోచుకున్న నరేష్ అనే నేరస్థుడు పోలీసుల కస్టడీ నుంచి పరారయ్యాడు. ASP అనుజ్ చౌదరి నేతృత్వంలో బృందం ఏర్పాటు చేసి, మఖన్‌పూర్ ప్రాంతంలో నరేష్‌తో కాల్పులు జరిగాయి. ఆపరేషన్ ఖల్లాస్ కింద, నరేష్‌ను ఎన్‌కౌంటర్‌లో చంపారు. ఈ సమయంలో రామ్‌గఢ్ SO సంజీవ్ దూబే కూడా కాల్పుల్లో మరణించారు. గ్రామీణ ASP అనుజ్ చౌదరికి బుల్లెట్ తగిలినా, బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్ కారణంగా ఆయనకు గాయమేమీ కాలేదు. అక్టోబర్ 5న, సహరాన్‌పూర్‌లో ఇమ్రాన్ అనే నేరస్థుడు ఎన్‌కౌంటర్‌లో మరణించారు. అతనికి తలపై లక్ష రూపాయల రివార్డు ఉంది. కాగా 13 దోపిడీ కేసుల్లో నిందితుడు.ముజఫర్‌నగర్‌లో వరుసగా రెండు ఎన్‌కౌంటర్లు జరిగాయి.
Details
మీరట్‌లో వస్త్ర వ్యాపారి ఎన్‌కౌంటర్
లక్ష రూపాయల రివార్డు ఉన్న నేరస్థుడు మెహతాబ్‌ను, ఆరు హత్య, 20 దోపిడీ కేసుల్లో పరారీలో ఉన్న నయీమ్ ఖురేషిని పోలీసులు చంపారు. లక్నోలో అత్యాచార నిందితుడు, ఘజియాబాద్‌లో హత్య నిందితుడు, షామ్లీలో ఆవు స్మగ్లర్, ఝాన్సీలో వాంటెడ్ క్రిమినల్, బులంద్‌షహర్‌లో అత్యాచార నిందితుడు, బాగ్‌పత్‌లో దోపిడీ నిందితుడు, బల్లియాలో దొంగతనం నిందితుడు, ఆగ్రాలో జైలు నుంచి తప్పించుకున్న నేరస్థుడు, జలౌన్‌లో దోపిడీ నిందితుడిని ఎన్‌కౌంటర్ చేశారు. ఆపరేషన్ లాంగ్డా కింద, మీరట్‌లో వస్త్ర వ్యాపారి ఆదిల్‌ను కాల్చి చంపిన తర్వాత, వీడియోను వైరల్ చేసిన జుల్కమర్‌ను కూడా ఎన్‌కౌంటర్ చేశారు.
Details
గత ఎనిమిది సంవత్సరాల్లో 14,973 ఎన్‌కౌంటర్లు
గణాంకాల ప్రకారం, 2017 నుంచి ఉత్తరప్రదేశ్‌లో పోలీసు ఎన్‌కౌంటర్లలో 239 మంది నేరస్థులు మరణించారు. అదే సమయంలో 9,467 మంది గాయపడ్డారు. ఎన్‌కౌంటర్ల తరువాత 30,694 మంది నేరస్థులను అరెస్టు చేశారు. గత ఎనిమిది సంవత్సరాల్లో 14,973 ఎన్‌కౌంటర్లు జరిగాయి, మిరట్ జోన్‌లో అత్యధిక సంఖ్యలో ఎన్‌కౌంటర్లు నమోదయ్యాయి.