Page Loader
'దిల్లీ డిక్లరేషన్‌' వెనుక 200 గంటలు, 300 భేటీలు, 15 ముసాయిదాల కృషి
'దిల్లీ డిక్లరేషన్‌ వెనుక 200 గంటలు,300 భేటీలు,15 ముసాయిదాల కృషి'

'దిల్లీ డిక్లరేషన్‌' వెనుక 200 గంటలు, 300 భేటీలు, 15 ముసాయిదాల కృషి

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 10, 2023
02:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

జీ20 దిల్లీ డిక్లరేషన్‌ వెనుక భారీ కసరత్తు జరిగింది. ఫలితంగానే అధ్యక్ష హోదాలో భారత్‌ శనివారం గ్రాండ్ విక్టరీని సాధించగలిగింది. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భాగస్వామ్య దేశాల మధ్య అభిప్రాయభేదాలను పక్కనపెట్టి, సంయుక్త ప్రకటనపై ఏకాభిప్రాయాన్ని సాధించగలిగింది. దిల్లీ డిక్లరేషన్ ఏకాభిప్రాయానికి, దాని రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన భారత దౌత్యవేత్తల బృందాన్ని షెర్పా అమితాబ్ కాంత్ ప్రశంసించారు. ఈనం గంభీర్, కె.నాగరాజులతో కూడిన దౌత్యవేత్తల బృందం, సుమారు 200 గంటల పాటు 300 ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించిందని చెప్పారు. ఉక్రెయిన్ అంశంపై ఇతర దేశాల్లోని సహచరులతో 15 ముసాయిదాలను పంచుకున్నట్లు తెలిపారు. ఫలితంగా G-20 సదస్సు తొలిరోజే నేతల మధ్య ఏకాభిప్రాయాన్ని తెచ్చిందన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అమితాబ్ కాంత్ చేసిన ట్వీట్