Page Loader
రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించిన జీ20 దేశాధినేతలు 
రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించిన జీ20 దేశాధినేతలు

రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించిన జీ20 దేశాధినేతలు 

వ్రాసిన వారు Stalin
Sep 10, 2023
11:24 am

ఈ వార్తాకథనం ఏంటి

జీ20 సదస్సులో రెండో రోజులో భాగంగా ఆదివారం సభ్యదేశాల ప్రతినిధులు దిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. రాజ్‌ఘాట్ వద్ద జీ20 దేశాధినేతలకు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజ్‌ఘాట్ ప్రాంగణంలోకి ప్రవేశించిన నాయకులకు మోదీ ఖాదీ బహుమతులను అందజేసారు. అనంతరం జీ20 దేశాల ప్రతినిధులు గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా, సింగపూర్‌ ప్రధాని లీ సీన్‌ లూంగ్‌, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ గుటెర్రెస్, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ మసత్సుగు అసకవా, డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్, తదితరులు రాజ్‌ఘాట్‌ను సందర్శించిన వారిలో ఉన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రాజ్ ఘాట్ వద్ద జీ20 నేతలు