తదుపరి వార్తా కథనం
    
    
                                                                                Indian fisherman: పాకిస్థాన్ జైలు నుంచి 22 మంది భారత జాలర్ల విడుదల
                వ్రాసిన వారు
                Jayachandra Akuri
            
            
                            
                                    Feb 22, 2025 
                    
                     10:21 am
                            
                    ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ జైలు నుంచి 22 మంది భారత మత్స్యకారులు విడుదలయ్యారు. శిక్షాకాలం పూర్తి కావడంతో కరాచీలోని మాలిర్ కారాగారం నుంచి శుక్రవారం వారిని విడుదల చేశారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఈ రోజు వారిని భారత్‌కు అప్పగించే అవకాశం ఉంది. భారత జాలర్ల ప్రయాణ ఏర్పాట్లలో ఈది ఫౌండేషన్ కీలక సహాయసహకారాలు అందించింది. కరాచీ నుంచి లాహోర్ వరకు వెళ్లేందుకు అవసరమైన రవాణా సౌకర్యాలను సమకూర్చింది. అక్కడి నుంచి వారు భారత్‌కు చేరుకోనున్నారు.
Details
సరిహద్దులను దాటే మత్స్యకారులపై దయతో వ్యవహరించాలి
అదనంగా, ఈ సంస్థ మత్స్యకారులకు ప్రయాణ ఖర్చులు, కొన్ని బహుమతులు, నగదు అందజేసింది. ఈ సందర్భంగా ఈది ఫౌండేషన్ ఛైర్మన్ ఫైజల్ ఈది, భారత్-పాకిస్థాన్ ప్రభుత్వాలను ఒక అభ్యర్థన చేశారు. పొరపాటున అంతర్జాతీయ జలాల సరిహద్దులను దాటే మత్స్యకారులపై కఠిన చర్యలు కాకుండా, దయతో వ్యవహరించాలని కోరారు.