LOADING...
India-Pakistan Tension: భారత్, పాక్ మ‌ధ్య ఉద్రిక్త‌త‌.. 24 ఎయిర్‌పోర్టుల క్లోజ్‌
భారత్, పాక్ మ‌ధ్య ఉద్రిక్త‌త‌.. 24 ఎయిర్‌పోర్టుల క్లోజ్‌

India-Pakistan Tension: భారత్, పాక్ మ‌ధ్య ఉద్రిక్త‌త‌.. 24 ఎయిర్‌పోర్టుల క్లోజ్‌

వ్రాసిన వారు Sirish Praharaju
May 09, 2025
10:21 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత సైన్యం అమలు చేసిన ఆపరేషన్ సిందూర్ అనంతరం పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ ఆపరేషన్‌లో భాగంగా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని తొమ్మిది ప్రాంతాల్లో ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపి వాటిని పూర్తిగా ధ్వంసం చేసింది. దీని అనంతరం పాకిస్తాన్ తన దుష్ప్రవర్తనను కొనసాగిస్తూ భారత్‌పై దాడులకు ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా డ్రోన్లు, క్షిపణులతో దాడులకు పాల్పడుతోంది. అయితే, భారత్‌ భద్రతా దళాలు ఈ దాడులకు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయి.

వివరాలు 

సరిహద్దు రాష్ట్రాల్లో అప్రమత్తత - విమానాశ్రయాల తాత్కాలిక మూసివేత 

ఈ పరిణామాల నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. భద్రతా పరంగా అప్రమత్తంగా ఉండేందుకు, పంజాబ్‌, జమ్మూ కశ్మీర్‌, లడఖ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని మొత్తం 24 విమానాశ్రయాలను గురువారం తాత్కాలికంగా మూసివేశారు. ఇవన్నీ అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉండటంతో పాటు వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతాలుగా పరిగణించబడుతున్నాయి. పఠాన్‌కోఠ్‌, జలంధర్‌, జైసల్మేర్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే పాకిస్తాన్ డ్రోన్ దాడులు చేసిన నేపథ్యంలో, మరింత అపాయం తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అనేక ఎయిర్‌లైన్స్ సంస్థలు తమ ప్రయాణికుల కోసం ప్రత్యేక సూచనలను (అడ్వైజరీలు) జారీ చేశాయి.