Uttarpradesh: యూపీలో తీవ్ర విషాదం.. తొక్కిసలాటలో 23 మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు సహా 27 మంది మృతి
ఉత్తర్‌ప్రదేశ్ హత్రాస్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడ, సికంద్రరావు ప్రాంతంలోని మొఘల్ గర్హి గ్రామంలో మంగళవారం భోలే బాబా ప్రసంగం సందర్భంగా చెలరేగిన తొక్కిసలాటలో 27 మంది మరణించగా.. కాగా పలువురు గాయపడ్డారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు ఎటా సీఎంఓ డాక్టర్ ఉమేష్ కుమార్ త్రిపాఠి తెలిపారు. గాయపడిన మహిళలు, పిల్లలను చికిత్స కోసం ఎటా మెడికల్ కాలేజీకి పంపుతున్నారు. భోలే బాబా సత్సంగం హత్రాస్ జిల్లాలో జరుగుతుండగా, సత్సంగం ముగింపులో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో దాదాపు 27 మంది చనిపోయారు. ఈ తొక్కిసలాటలో 15 మందికి పైగా మహిళలు, చిన్నారులు గాయపడ్డారు. గాయపడిన మహిళలు, చిన్నారులను చికిత్స నిమిత్తం ఎటా మెడికల్ కాలేజీకి తరలించారు.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం యోగి ఆదిత్యనాథ్
హత్రాస్‌లో జరిగిన ఘోర ప్రమాదంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ దృష్టి సారించారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వెంటనే ఘటనాస్థలికి వెళ్లి చర్యలు తీసుకోవాలని సీఎం యోగి అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులందరికీ సరైన చికిత్స అందించాలని సీఎం ఆదేశించారు. అందుతున్న సమాచారం ప్రకారం ఆస్పత్రికి చేరే మృతదేహాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.