Page Loader
Agniveers: ఆపరేషన్ సిందూర్‌.. పాక్ డ్రోన్ల దాడిని ధైర్యంగా ఎదుర్కొన్న 3,000 మంది అగ్నివీరులు 
ఆపరేషన్ సిందూర్‌.. పాక్ డ్రోన్ల దాడిని ధైర్యంగా ఎదుర్కొన్న 3,000 మంది అగ్నివీరులు

Agniveers: ఆపరేషన్ సిందూర్‌.. పాక్ డ్రోన్ల దాడిని ధైర్యంగా ఎదుర్కొన్న 3,000 మంది అగ్నివీరులు 

వ్రాసిన వారు Sirish Praharaju
May 22, 2025
09:10 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ డ్రోన్లు, క్షిపణులు పంపేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్‌కు భారత సైన్యం చావు దెబ్బకొట్టింది. 'ఆపరేషన్‌ సిందూర్‌' పేరుతో నిర్వహించిన ఈ ప్రతిస్పందనలో శత్రుదేశం పంపిన క్షిపణులను సమర్థంగా ఎదుర్కొంది. ఈ ఆపరేషన్‌లో అగ్నివీరులు కీలక భూమిక వహించినట్టు తాజా నివేదికలు తెలియజేశాయి. గగనతల రక్షణకు సంబంధించిన కీలక వ్యవస్థల్లో పని చేసిన అగ్నివీరులు, శత్రుపక్షం నుంచి వచ్చిన దాడులను సమర్ధంగా ఎదుర్కొన్నారు. ఈ యూనిట్లలో ఒక్కో యూనిట్‌కు 150 నుంచి 200 మంది అగ్నివీరులు చొప్పున పనిచేశారు. మొత్తం మీద 3,000 మందికి పైగా అగ్నిపథ్ పథకం ద్వారా సైన్యంలో చేరిన అగ్నివీరులు 'ఆపరేషన్‌ సిందూర్‌'లో పాల్గొన్నారు.

వివరాలు 

సాంకేతిక విభాగాల్లో అగ్నివీరులు

వీరు సరిహద్దుల్లో ఉన్న ప్రాధాన్యత గల సైనిక స్థావరాలు, ఎయిర్ బేస్‌లలో విధులు నిర్వహించారు. సాదారణ సైనికుల పక్కన నిలిచి, అత్యంత ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా విశేష ధైర్యంతో శత్రు దాడులను తిప్పికొట్టారు. పాకిస్తాన్‌ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను గగనతలంలోనే నాశనం చేయడంలో వీరి పాత్ర కీలకమైంది. ఈ అగ్నివీరులు గన్నర్లు, ఫైర్ కంట్రోల్ ఆపరేటర్లు, రేడియో ఆపరేటర్లు వంటి సాంకేతిక విభాగాల్లో పని చేశారు. అంతేకాదు, క్షిపణులు, ఆయుధాలతో కూడిన భారీ రక్షణ వాహనాలకు డ్రైవర్లుగా కూడా సేవలందించారు. వారు కేవలం సాయుధ సేవలకే కాదు, దేశ రక్షణలో పటిష్టమైన శక్తిగా నిలిచారు.