Page Loader
Parliament: నకిలీ ఆధార్ కార్డులు చూపించి పార్లమెంట్‌లోకి ప్రవేశించిన ముగ్గురి అరెస్ట్ 
నకిలీ ఆధార్ కార్డులు చూపించి పార్లమెంట్‌లోకి ప్రవేశించిన ముగ్గురి అరెస్ట్

Parliament: నకిలీ ఆధార్ కార్డులు చూపించి పార్లమెంట్‌లోకి ప్రవేశించిన ముగ్గురి అరెస్ట్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 07, 2024
09:27 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ముగ్గురు కూలీలు నకిలీ ఆధార్ కార్డులను ఉపయోగించి హైసెక్యూరిటీ పార్లమెంట్ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. దీంతో ఆ ముగ్గురిని అరెస్టు చేశారు. ఫోర్జరీ,మోసం ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు ముగ్గురు నిందితులు కాసిం,మోనిస్,సోయెబ్‌లను అరెస్టు చేశారు. మంగళవారం పార్లమెంట్‌ హౌస్‌ ఫ్లాప్‌ గేట్‌ వద్ద భద్రతా తనిఖీల కోసం క్యూలో నిలబడిన ముగ్గురిని సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు అధికారిక వర్గాలు వెల్లడించాయి.ఈ ముగ్గురు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకోని IPC సెక్షన్ 419/465/468/471/120B కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ ప్రకారం,జూన్ 4 మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ ముగ్గురు నకిలీ ఆధార్ కార్డుల ద్వారా గేట్ నంబర్ 3నుండి లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించారు.

Details 

ముగ్గురిని పట్టుకున్న సీఐఎస్ఎఫ్ 

మంగళవారం, పార్లమెంట్ హౌస్ ప్రవేశ ద్వారం వద్ద భద్రత, గుర్తింపు కార్డుల తనిఖీలో ముగ్గురు వ్యక్తులను CISF సిబ్బంది అదుపులోకి తీసుకున్నట్లు వర్గాలు తెలిపాయి. ముగ్గురూ తమ ఆధార్ కార్డులు చూపించి పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. వారి కార్డులపై సీఐఎస్ఎఫ్ సిబ్బందికి అనుమానం రావడంతో విచారించగా అవి నకిలీవి అని తేలింది. సిఆర్‌పిఎఫ్ , ఢిల్లీ పోలీసు బృందాల స్థానంలో ఇటీవల సిఐఎస్‌ఎఫ్‌కు పార్లమెంటు భవనం భద్రత బాధ్యతలు అప్పగించారు. పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ లోపల ఎంపీ లాంజ్ నిర్మాణం కోసం 'డీవీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్' ఈ ముగ్గురిని నియమించుకున్నట్లు అధికారులు తెలిపారు. ముగ్గురు నిందితులను షానవాజ్ ఆలం అనే కాంట్రాక్టర్ నియమించుకున్నాడు.

Details 

పార్లమెంటులోకి గతేడాది ఇద్దరు యువకులు 

గత సంవత్సరం డిసెంబర్ 13 న, ఇద్దరు యువకులు ప్రేక్షకుల గ్యాలరీ నుండి డెస్క్‌పైకి దూకి, కలర్ స్మోగ్‌ను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో హాలు మొత్తం పొగతో నిండిపోయింది. అప్పటి నుంచి పార్లమెంట్ భద్రతను పెంచారు. అయితే, ఈ వ్యక్తులను అక్కడ ఉన్న భద్రతా దళాలు పట్టుకున్నాయి. వారితో పాటు, ఇతర సహచరులను కూడా అరెస్టు చేశారు. మణిపూర్ హింస, నిరుద్యోగం, రైతుల సమస్యలపై దృష్టిని ఆకర్షించడమే తమ లక్ష్యమని అరెస్టయిన నిందితులు చెప్పారు. ఈ కేసులో ఇప్పటి వరకు 6 మందిని అరెస్టు చేశారు.