Loading...
Gang rape in Delhi: దిల్లీలో దారుణం.. యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన సహోద్యోగులు..!
దిల్లీలో దారుణం.. యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన సహోద్యోగులు..!

Gang rape in Delhi: దిల్లీలో దారుణం.. యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన సహోద్యోగులు..!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 25, 2026
09:08 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీలో మరో సామూహిక అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. తూర్పు దిల్లీలోని ఓ కేఫ్‌లో పనిచేస్తున్న సహోద్యోగులే యువతిపై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

వివరాలు 

కేఫ్‌లో పార్టీ.. అనంతరం అఘాయిత్యం

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. దిల్లీలోని ఓ కేఫ్‌లో పనిచేస్తున్న ఎనిమిది మంది ఉద్యోగులు సోమవారం రాత్రి పార్టీ చేసుకున్నారు.

వారిలో ఓ ఉద్యోగి వద్ద కేఫ్ తాళాలు ఉండటంతో, పని ముగిసిన తర్వాత మూసివేసిన కేఫ్‌ను తిరిగి తెరిచారు.

అనంతరం అర్ధరాత్రి వరకు అక్కడే మద్యం సేవించారు. ఈ సమయంలో ఇద్దరు సహోద్యోగులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని, మిగిలినవారు వారికి సహకరించారని బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మంగళవారం తెల్లవారుజామున బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆరుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

ఈ కేసులో ఇద్దరు మహిళలు సహా ముగ్గురిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన నిందితుల ఆచూకీ కోసం ప్రత్యేకంగా గాలిస్తున్నారు.

వివరాలు 

సీసీటీవీ దృశ్యాల పరిశీలన

మరోవైపు, పార్టీ ముగిసిన తర్వాత బాధిత యువతి తన స్నేహితుడు, ఇద్దరు మహిళలతో కలిసి కేఫ్ నుంచి బయటకు వెళ్లినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.

ఆ తర్వాత కొద్దిసేపటికే ఆమె పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం బాధితురాలి వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. కేసుకు సంబంధించిన ఇతర వివరాలను సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ADVERTISEMENT