LOADING...
Tamilnadu: విరుదునగర్‌లోని సత్తూరులో బాణాసంచా ఫ్యాక్టరీ పేలుడు.. ముగ్గురు మృతి
విరుదునగర్‌లోని సత్తూరులో బాణాసంచా ఫ్యాక్టరీ పేలుడు.. ముగ్గురు మృతి

Tamilnadu: విరుదునగర్‌లోని సత్తూరులో బాణాసంచా ఫ్యాక్టరీ పేలుడు.. ముగ్గురు మృతి

వ్రాసిన వారు Stalin
Jun 29, 2024
11:17 am

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడులోని విరుదునగర్‌, సత్తూరు సమీపంలోని బండువార్‌పట్టిలోని బాణాసంచా ఫ్యాక్టరీలో శనివారం ఉదయం పేలుడు సంభవించి ముగ్గురు కార్మికులు మరణించారు. అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తమిళనాడులోని ప్రతి ఏటా ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే వుండటం రివాజే. ప్రభుత్వాలు ఎన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్న కానీ మానవ తప్పిదం లేదా నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతూనే వున్నాయి. విరుదునగర్‌ కలెక్టర్ జయశీలన్,ఇతర పోలీసు,ఫైర్ సిబ్బంది ఘటనా స్ధలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కాగా,ఈఘటనపై ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై నివేదికను సమర్పించాలని కలెక్టర్ జయశీలన్ ను కోరారు. బాధితుల హాహాకారాలతో ఆ ప్రాంతం భయానకంగా వుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పేలుడులో ముగ్గురు మృతి,ఒకరికి గాయాలు