Page Loader
Haryana: హర్యానా ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీలో చేరిన ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు
హర్యానా ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీలో చేరిన ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు

Haryana: హర్యానా ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీలో చేరిన ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 09, 2024
04:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

హర్యానాలో ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ మూడోసారి విజయం సాధించింది. కమలం పార్టీ 48 స్థానాలలో విజయం సాధించగా, కాంగ్రెస్‌ 37 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఈ నేపథ్యంలో గెలిచిన స్వతంత్ర అభ్యర్థులు కూడా కమలం పార్టీకే మద్దతు ప్రకటించారు. హర్యానాలో విజయం సాధించిన ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేల్లో భారత్‌లో సంపన్న మహిళా నేత సావిత్రి జిందాల్‌ ఉన్నారు. ఆమెతో పాటు ఇండిపెండెంట్‌ అభ్యర్థులుగా పోటీ చేసి గెలిచిన దేవేందర్‌ కడ్యాన్‌, రాజేశ్‌ జూన్‌ బీజేపీ అధినాయకత్వంతో భేటీ అయ్యారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ ధర్మేంద్ర ప్రధాన్‌ నివాసంలో కడ్యాన్‌ , రాజేశ్‌ జూన్‌ ఆ పార్టీలో చేరారు. సావిత్రి జిందాల్‌ కూడా ఆ పార్టీకి మద్దతు ప్రకటించారు.

వివరాలు 

సావిత్రి జిందాల్‌ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం

సావిత్రి జిందాల్‌ గత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2005, 2009లో హిస్సార్‌ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఆమె బీజేపీ టికెట్‌పై పోటీ చేస్తారని అందరూ భావించారు. కానీ ఆ పార్టీ టికెట్‌ దక్కకపోవడంతో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. తాజా బీజేపీ రికార్డు విజయంతో, తిరిగి ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరో స్వతంత్ర ఎమ్మెల్యే కడ్యాన్‌ కూడా బీజేపీ రెబల్‌గా పోటీ చేసి గనౌర్‌ నుంచి గెలుపొందారు. రాజేశ్‌ జూన్‌ బహదూర్‌గఢ్‌లో బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించారు.