అసోంలోని సోనిత్‌పూర్‌లో 4.4 తీవ్రతతో భూకంపం
అసోంలోని సోనిత్‌పూర్‌లో సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. 15 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) పేర్కొంది. అయితే భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా సోమవారం ఉదయం భూమి కంపించింది. ఉదయం 7:48 గంటల ప్రాంతంలో 4.8 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది. దిగ్లీపూర్‌కు తూర్పున 137 కిలోమీటర్ల దూరంలో ప్రకంపనలు సంభవించినట్లు ఎన్‌సీఎస్ పేర్కొంది. జమ్ముకశ్మీర్‌లోని పాకిస్థాన్, శ్రీనగర్, పూంచ్, ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతాల్లో ఆదివారం ప్రకంపనలు సంభవించాయి. జమ్ముకశ్మీర్‌లో భూకంపం సంభవించడంతో భయాందోళనలకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.