
Budget-2024: వందే భారత్ తరహాలో40,000 రైలు కోచ్‌లు : ఆర్థిక మంత్రి
ఈ వార్తాకథనం ఏంటి
ఈ రోజు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ లో రైళ్లు, విమానయానరంగానికి సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు.
కనెక్టివిటీ,ప్రయాణీకుల సౌకర్యాన్నిపెంపొందించడంపై కేంద్రం దృష్టి పెట్టిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
40,000 సాధారణ రైలు కోచ్‌లను వందే భారత్ ప్రమాణాలకు మారుస్తామని చెప్పారు. తద్వారా ప్రయాణికుల భద్రత, సౌకర్యాలను మరింత పెంచనున్నట్లు చెప్పారు.
ఇంధన మినరల్,సిమెంట్ కోసం పోర్ట్ కనెక్టివిటీ కారిడార్లు,హై ట్రాఫిక్ డెన్సిటీ కారిడార్లు లాంటి మూడు రైల్వే కారిడార్లను నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు. పీఎం గతిశక్తి పథకం కింద 3 కారిడార్లను నిర్మిస్తామనన్నారు.
Details
10 సంవత్సరాలలో రెట్టింపైన విమానాశ్రయాల సంఖ్య
అధిక-ట్రాఫిక్ కారిడార్‌ల రద్దీని తగ్గించడం,ప్యాసింజర్ రైళ్ల కార్యకలాపాలను మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుందని అన్నారు.
దీని ఫలితంగా ప్రయాణీకులకు భద్రత,అధిక ప్రయాణ వేగం పెరుగుతుందని ఆమె ఎత్తి చూపారు. ప్రత్యేక సరుకు రవాణా కారిడార్‌లతో,మూడు కారిడార్ కార్యక్రమాలు భారతదేశ జిడిపి వృద్ధిని వేగవంతం చేస్తాయని మంత్రి అన్నారు.
విమానయానంపై,సీతారామన్ మాట్లాడుతూ, గత 10 సంవత్సరాలలో విమానాశ్రయాల సంఖ్య రెట్టింపు అయి 149కి చేరుకుంది.
UDAN (ఉడే దేశ్ కా ఆమ్ నాగ్రిక్) పథకం టైర్ II, టైర్ III నగరాలకు కనెక్టివిటీని విస్తరించిందన్నారు.
భారతీయ క్యారియర్లు 1,000 కొత్త విమానాల కోసం ఆర్డర్లు ఇచ్చాయని ఆర్థికమంత్రి హైలైట్ చేశారు.
ప్రస్తుతం ఉన్న విమానాశ్రయాల విస్తరణ, కొత్త విమానాశ్రయాల అభివృద్ధి శరవేగంగా కొనసాగుతాయని ఆమె తెలిపారు.