మణిపూర్‌లో 40మంది మిలిటెంట్లు హతం: సీఎం బీరెన్ సింగ్
ఈ వార్తాకథనం ఏంటి
మణిపూర్‌లో హింస ఆగడం లేదు. గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో అల్లర్లు చెలరేగుతున్నాయి.
మణిపూర్‌లోని ఇంఫాల్ లోయలో భద్రతా బలగాలు గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఆపరేషన్‌లో కనీసం 40మంది కుకీ మిలిటెంట్లు మరణించారు.
ఈ క్రమంలో ఆదివారం ఘర్షణల్లో నలుగురు పౌరులు, ఒక భద్రతా అధికారి కూడా మరణించినట్లు ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్ తెలిపారు.
రాష్ట్రంలో జనాభాలో 53శాతం ఉన్న ఆధిపత్య సమాజమైన మైతీలను షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) జాబితాలో చేర్చాలని ఏప్రిల్ 27న మణిపూర్ హైకోర్టు ఆదేశించిన తర్వాత రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి.
గిరిజన కుకీ సంఘం హైకోర్టు ఆదేశాలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ క్రమంలో కుకీ తెగకు చెందిన మిలిటెంట్లు హింసకు తెగబడినట్లు పోలీసులు చెబుతున్నారు.
మణిపూర్
నేడు మణిపూర్‌లో అమిత్ షా పర్యటన
కుకీ మిలిటెంట్లు ఏకే-47, ఎం-16, స్నిపర్ రైఫిల్స్‌తో కుకీ మిలిటంట్లు పౌరులపై కాల్పులు జరుపుతున్నారని, వారిని ఉగ్రవాదులుగా ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్ అభివర్ణించారు.
ఇదిలా ఉంటే, సోమవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా మణిపూర్‌లో పర్యటించనున్నారు. ఈ క్రమంలో సీఎం, మంత్రులు, భద్రతా అధికారులతో శాంతి భద్రతలపై చర్చించనున్నారు.
ఆర్మీ, అస్సాం రైఫిల్స్, రాష్ట్ర పోలీసులు ఆధ్వర్యంలో గురువారం రాష్ట్రంలో మిలిటెంట్ల ఏరివేత కోసం కూంబింగ్ కార్యకలాపాలను ముమ్మరం చేశారు.
కూంబింగ్ కొనసాగుతున్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
మే 3 నుంచి హింస చెలరేగిన దగ్గర నుంచి రాష్ట్రంలో 74మంది మరణించినట్లు పోలీసులు తెలిపారు.