
Srisailam Reservoir: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం.. 5 గేట్లు ఎత్తివేత
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో కృష్ణా నది,దాని ఉపనదుల్లోకి భారీగా వరదనీరు చేరుతోంది. ఈ వరద ప్రభావం వల్ల శ్రీశైలం జలాశయానికి పెద్ద మొత్తంలో ప్రవాహం వచ్చి చేరుతోంది. శ్రీశైలం పైభాగంలో ఉన్న తుంగభద్ర,జూరాల ప్రాజెక్టుల గేట్లను అధికారులు ఎత్తి, వాటి ద్వారా భారీగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఫలితంగా, శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అధికారులు అప్రమత్తమయ్యారు. నిన్నటిదాకా తెరిచిన మూడు గేట్లకు అదనంగా మరో రెండు గేట్లను జోడించి, మొత్తం ఐదు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు.
వివరాలు
శ్రీశైలం జలాశయ నీటిమట్టం ప్రస్తుతం 883 అడుగుల
ప్రస్తుతం ఎగువనుంచి 2,32,290 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి చేరుతుండగా,ఐదు గేట్లతో పాటు కుడి, ఎడమ వైపు ఉన్న విద్యుత్ కేంద్రాల ద్వారా కలిపి మొత్తం 2,01,743 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతానికి ఇది 883 అడుగులకు చేరినట్లు అధికారులు వెల్లడించారు. ఎగువ నుంచి వచ్చే ప్రవాహాన్ని గంటకు గంట మానిటరింగ్ చేస్తున్న అధికారులు, వరద ప్రవాహం మరింత పెరిగిన సందర్భంలో మరో గేటును కూడా ఎత్తేందుకు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు.