NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Bengaluru: బెంగళూరులో 29ఏళ్ళ మహిళ దారుణ హత్య.. 50 ముక్కలు చేసి రిఫ్రిజిరేటర్‌లో.. 
    తదుపరి వార్తా కథనం
    Bengaluru: బెంగళూరులో 29ఏళ్ళ మహిళ దారుణ హత్య.. 50 ముక్కలు చేసి రిఫ్రిజిరేటర్‌లో.. 
    బెంగళూరులో 29ఏళ్ళ మహిళ దారుణ హత్య.. 50 ముక్కలు చేసి రిఫ్రిజిరేటర్‌లో..

    Bengaluru: బెంగళూరులో 29ఏళ్ళ మహిళ దారుణ హత్య.. 50 ముక్కలు చేసి రిఫ్రిజిరేటర్‌లో.. 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 23, 2024
    01:04 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బెంగళూరు నగరంలో 29 ఏళ్ల ఓ మహిళ దారుణంగా హత్యకు గురైంది. కొంత కాలంగా తన భర్తకు దూరంగా ఉంటున్న మహాలక్ష్మి, తన అపార్ట్‌మెంట్‌లోనే హత్య చేయబడింది.

    హత్య తరువాత ఆమె మృతదేహాన్ని 50 ముక్కలు చేసి ఫ్రిజ్‌లో ఉంచారు. అపార్ట్‌మెంట్ నివాసులకి దుర్వాసన రావడంతో, వారు యజమానికి ఫిర్యాదు చేశారు.

    మొదట పాడైపోయిన ఆహారం వల్ల దుర్వాసన వస్తుందేమో అనుకున్నారు. అయితే శనివారం దుర్వాసన భరించలేని స్థాయిలో పెరగడంతో, అపార్ట్‌మెంట్ యజమాని ఇంటి తాళాలు పగులగొట్టి పరిశీలించారు.

    రిఫ్రిజిరేటర్ నుండి వస్తున్న దుర్వాసనతో వస్తుండడంతో,ఫ్రిడ్జ్ డోర్ తీసి చూసి హతాశులయ్యారు అందులో మృత మహిళ శరీర భాగాలు, రక్తంతో ఫ్రిజ్ నిండిపోయి ఉంది.

    వివరాలు 

     మహాలక్ష్మి తల్లి,పోలీసులకు అపార్ట్‌మెంట్ యజమాని సమాచారం 

    జార్ఖండ్‌కు చెందిన మహాలక్ష్మికి, కొన్ని సంవత్సరాల క్రితం హేమంత్ దాస్‌తో వివాహమైంది.

    భర్తతో విభేదాల కారణంగా, ఆమె కొన్ని నెలలుగా వేరుగా నివసిస్తోంది. వ్యాలికావల్ ప్రాంతంలోని ఒక అపార్ట్‌మెంట్‌లో సింగిల్ బెడ్‌రూమ్ గదిని అద్దెకు తీసుకొని ఉంది.

    అపార్ట్‌మెంట్ యజమాని, మహాలక్ష్మి తల్లి,పోలీసులకు సమాచారం ఇచ్చారు.

    హత్య విషయాన్ని తెలుసుకున్న మహాలక్ష్మి భర్త హేమంత్ అక్కడికి చేరుకున్నారు. పోలీసులు హేమంత్,మహాలక్ష్మి తల్లిని విడివిడిగా ప్రశ్నించి వివరాలు సేకరించారు.

    స్థానికులు తెలిపిన మేరకు,ఒక యువకుడు తరచుగా మహాలక్ష్మిని ఉదయం తీసుకెళ్లి సాయంత్రం ఇంటి దగ్గర వదిలి వెళ్ళేవాడని తెలిపారు.

    ఆ యువకుడు ఈ హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు ఈ హత్య 4 నుండి 5 రోజుల క్రితం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.

    వివరాలు 

    ఢిల్లీలోశ్రద్ధా వాకర్ దారుణ హత్య 

    మహాలక్ష్మి ఫోన్ సెప్టెంబర్ 10 నుండి స్విచ్ఛాఫ్ వస్తోందని ఆమె తల్లి తెలిపారు.

    ఈ హత్యపై బెంగళూరు పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 103 (1)కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

    హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆదివారం బాధితురాలి మృతదేహాన్ని శవపరీక్షకు పంపించగా, ఫలితాలు రావాల్సి ఉంది.

    29 ఏళ్ల బాధితురాలు మహాలక్ష్మి మల్లేశ్వరంలోని ఫ్యాషన్ ఫ్యాక్టరీ, బట్టల దుకాణంలో టీమ్ లీడర్‌గా పనిచేసింది.న్యూస్18 ప్రకారం, ఆమె గత రెండు వారాలుగా పనికి వెళ్లలేదు.

    మహాలక్ష్మితో పాటు, మీనా రానా,ఆమె భర్త చరణ్ సింగ్‌లకు ముగ్గురు పిల్లలు.. లక్ష్మి,ఉక్కుమ్,నరేష్.

    ఆమె తల్లి తెలిపిన వివరాల ప్రకారం.. నేలమంగళలో తమ నాలుగేళ్ల కుమార్తెతో నివసిస్తున్న హేమంత్ దాస్‌తో మహాలక్ష్మికి వివాహం జరిగింది.

    వివరాలు 

    ఢిల్లీలోశ్రద్ధా వాకర్ దారుణ హత్య 

    అతను మొబైల్ ఫోన్ ఉపకరణాల దుకాణాన్ని నడుపుతున్నాడు.విషయం తెలిసిన వెంటనే దాస్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

    ఈ ఘటన బెంగళూరు నగరాన్ని వణికించింది. ఇది 2022లో ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ దారుణ హత్యను పోలి ఉంది.

    శ్రద్ధా వాకర్‌ను ఆమె లివ్-ఇన్ పాట్నర్ ఆఫ్తాబ్ పూనావాలా దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలు చేసి ఫ్రిజ్‌లో పెట్టాడు.

    3 వారాల తరువాత ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ హత్యపై బెంగళూరు పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 103 (1) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బెంగళూరు

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    బెంగళూరు

    Karnataka: ఫామ్‌హౌస్‌లో 32 పుర్రెలు.. యజమాని అరెస్ట్  కర్ణాటక
    Bengaluru Shocker: బెంగళూరులో దారుణం.. కుళ్లిన స్థితిలో యువతి నగ్న ముతదేహం  హత్య
    Bengaluru: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు.. అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ  ఎన్ఐఏ
    Bengaluru: ఉజ్బెకిస్థాన్ మహిళ అనుమానాస్పద మృతి  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025