Delhi CM: 50 మంది సినీ నటులు, పారిశ్రామికవేత్తలు,దౌత్యవేత్తలు..ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారీగా ఏర్పాట్లు
ఈ వార్తాకథనం ఏంటి
26 ఏళ్ల కల నిజమవుతోంది! దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ (BJP), త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
ఇన్నేళ్ల తర్వాత అధికారంలోకి వస్తున్న సందర్భంగా, నూతన ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని (Delhi CM Oath Taking) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
ఈ వేడుకకు సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు భారీ సంఖ్యలో హాజరుకానున్నట్లు సమాచారం.
బీజేపీ వర్గాల ప్రకారం,ఫిబ్రవరి 20 (గురువారం)సాయంత్రం 4.30 గంటలకు కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేయనున్నాడు.
ఈ కార్యక్రమం ప్రముఖ రామ్‌లీలా మైదాన్‌లో జరగనుంది.ఈ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు కమలదళం భారీ ప్రణాళికలు రూపొందిస్తోంది.
ప్రమాణస్వీకారానికి ముందు దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన కళాకారుల ద్వారా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు.
వివరాలు
శాసనసభ ఎన్నికలల్లో బీజేపీ ఘన విజయం
ఈ వేడుకకు 50 మంది సినీ ప్రముఖులు, పారిశ్రామిక దిగ్గజాలు, విదేశీ రాయబారులు, 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలు హాజరుకానున్నారు.
దిల్లీకి చెందిన రైతులు, కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను కూడా ఈ వేడుకకు ఆహ్వానించనున్నట్లు సమాచారం.
అదనంగా, బాబా రాందేవ్, స్వామి చిదానంద్, బాబా బాగేశ్వర్ ధీరేంద్రశాస్త్రి వంటి ఆధ్యాత్మిక గురువులు ప్రత్యేక అతిథులుగా పాల్గొననున్నట్లు భాజపా వర్గాలు వెల్లడించాయి.
ఫిబ్రవరి 8న జరిగిన శాసనసభ ఎన్నికల (Assembly Elections) ఫలితాల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
అయితే, ఎన్నికల ఫలితాలు వచ్చి 10 రోజులు గడిచినా, కొత్త సీఎం ఎవరనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.
వివరాలు
శాసనసభాపక్ష సమావేశం.. కొత్త ముఖ్యమంత్రితో పాటు కేబినెట్ మంత్రుల ఎంపిక
మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేశ్ వర్మ పేరు ముఖ్యమంత్రి పదవికి ప్రధానంగా వినిపిస్తోంది.
ఆయన తాజా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై విజయం సాధించారు.
బుధవారం బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరుగనుంది. ఇందులో కొత్త ముఖ్యమంత్రితో పాటు కేబినెట్ మంత్రుల ఎంపిక కూడా జరిగే అవకాశం ఉంది.