Maha Kumbh Mela: మహా కుంభమేళాలో తప్పిపోయిన 54,000 మంది భక్తులు తిరిగి ఇంటికి చేరిక
ఈ వార్తాకథనం ఏంటి
ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా 2025 మహాశివరాత్రి పండుగ రోజున చివరి అమృత స్నానంతో ముగియనుంది.
ఈ 45 రోజుల వేడుకలో 66 కోట్ల మందికిపైగా భక్తులు త్రివేణి సంగమంలో స్నానమాచరించారు.
45 రోజుల్లో ఇప్పటివరకు 66 కోట్ల 21 లక్షల మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేశారని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.
ప్రయాగరాజ్‌లో ఇటీవల తమ కుటుంబ సభ్యుల నుంచి విడిపోయిన 54,000 మంది తిరిగి వారి బంధువులను కలుసుకున్నట్లు ఓ నివేదిక వెల్లడించింది.
మహా కుంభమేళా 2025, చరిత్రలో మరొక గొప్ప అధ్యాయంగా నిలిచింది. అశేష భక్తజన సందోహం మధ్య చాలా మంది తమ కుటుంబ సభ్యుల నుంచి తప్పిపోయిరు.
Details
డిజిటల్ 'ఖోయా పాయా కేంద్రం' కీలక భూమిక
అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సమర్థమైన చర్యల కారణంగా 54,357 మంది తిరిగి వారి కుటుంబ సభ్యులను కలుసుకున్నారు.
ఈ సందర్భంగా 'డిజిటల్ ఖోయా పాయా కేంద్రం' సేవలు ఎంతో ప్రభావవంతంగా పనిచేశాయి.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కేంద్రాల ద్వారా 35,000 మందికి పైగా భక్తులు తిరిగి తమ కుటుంబ సభ్యులను కలుసుకున్నారు.
మొత్తం 10 డిజిటల్ ఖోయా పాయా కేంద్రాలు మహాకుంభమేళా ప్రాంగణంలో ఏర్పాటు చేశారు.
మకర సంక్రాంతి (జనవరి 13-15) సమయంలో 598 మంది, మౌని అమావాస్య (జనవరి 28-30) రోజుల్లో 8,725 మంది, బసంత్ పంచమి (ఫిబ్రవరి 2-4) సందర్భంగా 864 మంది తమ కుటుంబ సభ్యులను తిరిగి కలుసుకున్నారు.
Details
తదుపరి కుంభమేళా ఎక్కడ, ఎప్పుడు?
ఈ మహా కుంభమేళాలో ప్రభుత్వంతో పాటు, హేమ్వతి నందన్ బహుగుణ స్మృతి సమితి, భారత్ సేవా కేంద్రం వంటి స్వచ్ఛంద సంస్థలు కూడా తమ సేవలు అందించాయి.
మహా కుంభమేళా 2025 విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో, తదుపరి కుంభమేళా 2027లో మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో త్ర్యంబకేశ్వర్ వద్ద జరగనుంది.
ఈ పవిత్ర మహోత్సవం కోసం భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.