
Telangana: తెలంగాణ పోలీస్ అకాడమీ నుంచి 547 మంది ఎస్ఐలు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడెమీలో సబ్ ఇన్స్పెక్టర్ల పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు.
మొత్తం 547 మంది సబ్ ఇన్స్పెక్టర్లు తమ శిక్షణను విజయవంతంగా పూర్తిచేసి, పరేడ్‌లో పాల్గొన్నారు.
అధిక సంఖ్యలో మహిళా ఎస్‌ఐలు
ఈసారి పోలీస్ అకాడమీ నుంచి పాసవుతున్న 547 మంది ఎస్ఐలలో 145 మంది మహిళా సబ్ ఇన్స్పెక్టర్లు కాగా, 402 మంది పురుష సబ్ ఇన్స్పెక్టర్లు.
వీరిలో 401 మంది సివిల్ సబ్ ఇన్స్పెక్టర్లుగా ఉన్నారు. 71 మంది ఏఆర్ ఎస్ఐలు, 29 మంది టీజీఎస్‌పీ (RSI)లు, 22 మంది ఐటీసీ ఎస్ఐలు కూడా ఈ జాబితాలో ఉన్నారు.
విద్యార్హతలు
ఎస్ఐల విద్యార్హతలు
ఈ 547 మంది సబ్ ఇన్స్పెక్టర్లలో అధికంగా గ్రాడ్యుయేట్‌లే ఉన్నారు.మొత్తం 472 మంది గ్రాడ్యుయేట్ విద్యార్హత కలిగి ఉండగా,75 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్‌లు.
ప్రత్యేకంగా 248 మంది బిటెక్ చదువులు పూర్తి చేసుకున్నారు.221 మంది డిగ్రీ , 26 మంది ఎంటెక్ , 18 మంది ఎంబీఏ చదివారు.
ఈ పాసింగ్ అవుట్ పరేడ్‌కు మహిళా సబ్ ఇన్స్పెక్టర్ పల్లి భాగ్యశ్రీ పరేడ్ కమాండర్‌గా వ్యవహరించారు.
వయస్సు పరంగా 26-30 సంవత్సరాల వయస్సు గల 283 మంది అభ్యర్థులు అత్యధికంగా ఉండగా, 25 సంవత్సరాల లోపు వయసు గల 182 మంది, 31-35 సంవత్సరాల వయసు గల 58 మంది, 36-42 సంవత్సరాల వయసు గల 24 మంది ఉన్నారు.
విరాళం
వరద భాదితులకు తెలంగాణ పోలీసుల విరాళం
తెలంగాణలో వరదల వల్ల నష్టాలు ఏర్పడిన నేపథ్యంలో, పోలీస్ విభాగం తరఫున ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 11,06,83,571ల విరాళం అందజేశారు.
ఎస్ఐ పాసింగ్ అవుట్ పరేడ్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి డీజీపీ జితేందర్, శివధర్ రెడ్డి తదితరులు చెక్‌ను అందజేశారు.