CM Chandrababu: రాజధానిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం.. స్మారక పార్క్ ఏర్పాటు
ఈ వార్తాకథనం ఏంటి
పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు.
ఉండవల్లిలోని సీఎం నివాసంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి నారాయణ, డూండీ రాకేశ్ సహా పలువురు పాల్గొన్నారు.
చంద్రబాబు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు 58 రోజుల దీక్షకు గుర్తుగా రాజధానిలో 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు.
ఆయనకు గౌరవసూచకంగా స్మారక పార్కు ఏర్పాటు చేస్తామన్నారు. నెల్లూరులోని ఆయన స్వగ్రామ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు.
అక్కడ మ్యూజియం ఏర్పాటు చేయడంతో పాటు, ఆధునిక ఉన్నత పాఠశాల నిర్మించనున్నామని తెలిపారు.
Details
మార్చి 16 నుంచి జయంతి ఉత్సవాలు
ఇక రాష్ట్ర అభివృద్ధి దిశగా తీసుకుంటున్న నిర్ణయాలను వివరించిన చంద్రబాబు, ఈ ఉగాది నుంచి పీ-4 విధానాన్ని అమలు చేస్తామన్నారు.
రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు తొలగించేందుకు ఇది ఉపకరిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో ముందుకెళ్లాలన్నారు.
మనలో ప్రతి ఒక్కరూ కనీసం 10 మంది తెలుగువారిని ఎదగడానికి సహాయం చేయాలని పిలుపునిచ్చారు. అంతేగాక పొట్టి శ్రీరాములు జయంతి ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
వచ్చే ఏడాది మార్చి 16 వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయని తెలిపారు.