తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని 60కి పైగా ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు
మావోయిస్టుల సానుభూతిపరులే లక్ష్యంగా సోమవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని 60కి పైగా ప్రదేశాలలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సోదాలు నిర్వహిస్తోంది. రెండు రాష్ట్రాల్లోనూ అనుమానితుల ఇళ్లు, ఇతర స్థావరాల్లో దాడులు కొనసాగుతున్నాయి. నిఘా వర్గాల సమాచారం మేరకు ఎన్ఐఏ బృందాలు రాష్ట్ర పోలీసు బలగాల సాయంతో ఈ ఆపరేషన్ చేపట్టాయి. పలు నక్సల్స్ దాడుల కేసుల్లో కీలక ఆధారాలను సేకరించేందుకు ఎన్ఐఏ బృందాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని హైదరాబాద్, గుంటూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఓ అధికారి చెప్పారు. నక్సల్ సానుభూతిపరులతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న పౌరహక్కుల నేతల ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నాయి. ఈ దాడులు సోమవారం ఉదయం 5:30 గంటల నుంచి కొనసాగుతున్నాయి.