Page Loader
Chhattisgarh: నారాయణపూర్-బీజాపూర్ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టుల హతం.. ఈ ఏడాదిలో 112 మంది 
బీజాపూర్ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టుల హతం

Chhattisgarh: నారాయణపూర్-బీజాపూర్ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టుల హతం.. ఈ ఏడాదిలో 112 మంది 

వ్రాసిన వారు Stalin
Jun 08, 2024
11:58 am

ఈ వార్తాకథనం ఏంటి

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్-బీజాపూర్ అంతర్ జిల్లా సరిహద్దులోని అటవీ ప్రాంతంలో గురువారం భద్రతా సిబ్బందితో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మరణించారని పోలీసులు తెలిపారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో భద్రతా సిబ్బంది ఉమ్మడి బృందం మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్‌లో పాల్గొంది. దీనిని గమనించిన దళాలు ఇందుకు ప్రతిగా కాల్పులు జరిపాయి. అడపాదడపా కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని నారాయణపూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) ప్రభాత్ కుమార్ తెలిపారు. ఈ ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు మావోయిస్టు యూనిఫాంలో ఉన్న ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారని ఎస్పీ తెలిపారు.వారి యూనిఫారాన్నిబట్టి తమ పోలీసులు గుర్తించారన్నారు.

డీటెయిల్స్ 

ఏడు తుపాకీల స్వాధీనం 

దంతెవాడ, నారాయణపూర్ ,బస్తర్ జిల్లాలకు జిల్లా రిజర్వ్ గార్డ్‌కు సిబ్బంది మావోయిస్టుల ఇంద్రావతి ఏరియా కమిటీ 16వ ప్లాటూన్ వున్నట్లు సమాచారం వచ్చింది . దీనితో ఇతర క్యాడర్‌ల , బస్తర్ ఫైటర్స్ స్పెషల్ టాస్క్ ఫోర్స్- రాష్ట్ర పోలీసుల అన్ని యూనిట్లు కలిసి మొహరించారు. ఆ తర్వాత మూకుమ్ముడి దాడి చేశాయని ఆయన వివరించారు. ఎన్‌కౌంటర్ స్థలం నుంచి మొత్తం ఏడు తుపాకీలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందన్నారు. ఈ ఘటనతో రాష్ట్రంలో భద్రతా దళాలతో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఈ ఏడాది ఇప్పటివరకు 112 మంది నక్సలైట్లు మరణించారు.

డీటెయిల్స్ 

ఎక్కడో పట్టుకొచ్చి ఇక్కడ కాల్చిచంపారని గ్రామస్తుల ఆరోపణ 

ఏప్రిల్ 30న నారాయణపూర్ , కాంకేర్ జిల్లాల సరిహద్దులోని అటవీప్రాంతంలో భద్రతా సిబ్బందితో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మహిళలతో సహా 10 మంది మావోయిస్టులు మరణించారు. ఏప్రిల్ 16న, కంకేర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో భద్రతా దళాలు 29 మంది నక్సలైట్లను హతమార్చాయి. కాగా ఎక్కడో పట్టుకొచ్చి ఇక్కడ కాల్చిచంపారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టుల హతం