SLBC tunnel Collapse : SLBC టన్నెల్ ప్రమాదం విషాదాంతం .. చిక్కుకున్న 8మంది సజీవ సమాధి
ఈ వార్తాకథనం ఏంటి
SLBC టన్నెల్ ప్రమాదం విషాదకరంగా ముగిసింది. ఈరోజు (శుక్రవారం) SLBC టన్నెల్‌లో గల్లంతైన 8 మంది కార్మికుల మృతదేహాలను గుర్తించారు.
ఏడో రోజు రక్షణ చర్యలలో భాగంగా శ్రీశైలం ఎడమగట్టు కాలువ (SLBC) టన్నెల్‌లో అదృశ్యమైన కార్మికుల ఆచూకీ కనుగొనడానికి ప్రయత్నాలు చేపట్టారు.
దక్షిణ మధ్య రైల్వే నిపుణులు టీబీఎం మిషన్‌ను ప్లాస్మా గ్యాస్ కట్టర్స్ సహాయంతో కట్ చేశారు. బురద, శిథిలాలను తొలగించే ప్రక్రియలో కార్మికుల మృతదేహాలు వెలుగుచూశాయి.
వివరాలు
గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ పరీక్షలో మృతదేహాల గుర్తింపు
ఈరోజు కార్మికుల ఆచూకీ కోసం అత్యాధునిక 'గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (GPR)' పరీక్షలను ప్రభుత్వం నిర్వహించింది.
ఈ ప్రయోజనార్థం, గురువారం ఈ పరికరాన్ని సొరంగంలో ప్రవేశపెట్టారు. పైకప్పు కూలిన ప్రాంతంలో మట్టి, శిథిలాల కింద ఏముందో పరిశీలించారు.
ఈ ప్రక్రియలోనే మృతదేహాలను గుర్తించినట్లు తెలుస్తోంది. దాదాపు మూడు మీటర్ల లోతులో కార్మికుల మృతదేహాలు ఉన్నట్లు గుర్తించారు.